తెలుపు రంగు పులులు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా ఇవి అడవుల్లో కనిపించవు. కానీ ప్రపంచవ్యాప్తంగా జూలు, సంరక్షణ కేంద్రాల్లో వైట్ టైగర్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న నికరాగ్వ జంతు ప్రదర్శనశాలలో ఒక తెల్ల పులి పిల్ల జన్మించింది. కానీ తల్లి పులి ఈ కూనను దగ్గరకు రానివ్వట్లేదు. దీంతో జూ సిబ్బందే తెల్ల పులి కూనను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. దీనికి "నీవ్" (Nieve) అనే పేరు పెట్టారు. స్పానిష్ భాషలో నీవ్ అంటే మంచు అని అర్థం. వారం రోజుల క్రితం పులి ఈనిందని జూ డైరెక్టర్ ఎడ్వర్డో సకాసా తెలిపారు. పుట్టినప్పుడు ఇది ఒక కిలోకంటే తక్కువ బరువు ఉందని చెప్పారు.
సాధారణంగా జన్యులోపంతో తెలుపు రంగులో పులులు జన్మిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర జంతువుల పిల్లలు కూడా జన్యులోపం వల్ల వేరే రంగులో పుట్టే అవకాశం ఉంది. తెల్ల పులులు బెంగాల్ టైగర్ జాతికి చెందినవే ఉంటాయి. ఈ జాతి పులుల్లోనే జన్యువుల అభివృద్ధిలో లోపాలు కనిపిస్తాయని మిన్నెసోటాలోని ది వైల్డ్క్యాట్ సాంచురీ అధికారులు చెబుతున్నారు.
అమెరికాలో పుట్టిన మొట్టమొదటి వైట్ టైగర్ ఇదేనని నికరాగ్వ జంతుప్రదర్శనశాల ప్రకటించింది. రెండు సాధారణ బెంగాల్ టైగర్లకు నీవ్ పుట్టిందని అధికారులు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి పులిని ఒక సర్కస్ కంపెనీ నుంచి జూకు తరలించారు. దీని పూర్వీకుల్లో ఒకటి వైట్ టైగర్ ఉండేదట. అందుకే దీనికి పుట్టిన పిల్ల కూడా అవే జన్యువులతో తెలుపు రంగులో పుట్టిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
వైట్ టైగర్కు ఆకర్షణ
జూలకు వెల్లేవారిని తెల్ల పులులు ఎక్కువగా ఆకర్షిస్తాయి. దీంతో కొన్ని సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు తెల్ల పులులకు సంతానోత్పత్తి చేస్తాయి. కానీ ఇది అన్నిసార్లు సఫలం కాదు. జన్యులోపం వల్ల వైట్ టైగర్స్కు పుట్టే కూనలకు వైకల్యం, ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నీవ్ సంరక్షణ బాధ్యతలను జూ డైరెక్టర్ ఎడ్వర్డో సకాసా భార్య మెరీనా చూసుకుంటున్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆ కూనకు డబ్బా పాలను పట్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జూలో ఉన్న 700 జంతువుల బాధ్యతలను, ఒక రెస్క్యూ సెంటర్ను నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger