హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video: పింక్ డాల్ఫిన్లు.. ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చూడండి

Video: పింక్ డాల్ఫిన్లు.. ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చూడండి

పింక్ డాల్ఫిన్లు (image credit - twitter)

పింక్ డాల్ఫిన్లు (image credit - twitter)

Viral Video: ఈ కరోనా కాలంలో నిరాశ, నిస్పృహలతో ఉంటున్న వారికి... కొన్ని రకాల వైరల్ వీడియోలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ వీడియో అలాంటిదే. ఇందులో పింక్ డాల్ఫిన్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

Video: సముద్రమే ఓ వింత. దాన్ని తలచుకుంటేనే మనసులో పులకింత. ఆ చల్లటి గాలులు, విశాల దృశ్యాలు, కడలి కెరటాలు... ఆ వాతావరణమే ఓ అద్భుతం. ఆ సముద్ర గర్భంలో ఎన్నో వింతలు, విశేషాలు. మనం తరచిచూడాలే గానీ... మనం అలసిపోతామే తప్ప... ఆ కడలి మాత్రం ఎన్నో వింతల్ని చూపిస్తూనే ఉంటుంది. మహా సముద్రాల్లో వింత జీవులు ఎన్నో. చేపలు, చెట్లు, ఆల్చిప్పలు ఇలా ఎన్నో. ఐతే... ఇప్పటివరకూ మనం డాల్ఫిన్లలో వైట్ కలర్, గ్రే, బ్లూ కలర్‌వి మాత్రమే చూశాం. తాజాగా పింక్ కలర్ డాల్ఫిన్లు కనిపించి అలరించాయి. ఇప్పుడా డాల్ఫిన్ల వీడియో వీర వైరల్ అవుతోంది.

Pink Dolphin spotted in sea: సహజంగానే పింక్ డాల్ఫిన్లు కనిపించాయి అంటే... అది డూప్లికేట్ వీడియో కావచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఆ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసినది IFS ఆఫీసర్ సుశాంత నంద. ఆయనకు ఇలాంటివి బాగా తెలుసు. కాబట్టి అది ఒరిజినల్ వీడియోనే అని మనం నమ్మవచ్చు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.

డాల్ఫిన్ల ముఖం ఎప్పుడైనా గమనించారా... నవ్వుతున్నట్లు ఉంటుంది. అవి మనుషులలాగే తెలివైనవి. అందుకే మనుషులతో స్నేహం చేస్తాయి. మనతో ఆడతాయి. పిల్లలంటే డాల్ఫిన్లకు విపరీతమైన ఇష్టం. తాజా వీడియోను ఇప్పటికే 77వేల మంది చూశారు. అందరికీ నచ్చుతోంది ఇది. ఐదున్నర వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దాదాపు వెయ్యి మంది రీట్వీట్ చేశారు. చాలా మంది మనలాగే వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటివి కూడా ఉన్నాయా... నేనెప్పుడూ చూడలేదే అంటున్నారు. నిజమే కదా.. మనం ఎప్పుడూ చూడలేదుగా.

ఈ పింక్ కలర్ డాల్ఫిన్లు సముద్రాల్లోనే కాదు... దక్షిణ అమెరికాలోని ఆమెజాన్ నదిలో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మరీ పై వీడియోలో కనిపించినంత డీప్ పింక్ కలర్‌లో ఉండవు. ఇవి చాలా అరుదైనవి. ఎప్పుడుబడితే అప్పుడు కనిపించవు. 2020లో కనిపించిన ఓ వీడియోని ఇక్కడ చూడండి.

' isDesktop="true" id="1007278" youtubeid="qthWLEFADEw" category="international">

ఇది కూడా చదవండి: Video: పెళ్లి కాన్సిల్ అంటూ అలిగిన వధువు.. కారణం తెలుసా?

బాగున్నాయి కదా... మొత్తానికి ఇవాళ మనం అరుదైన డాల్ఫిన్లను చూసేశాం.

First published:

Tags: Viral, VIRAL NEWS, Viral tweet, Viral Video

ఉత్తమ కథలు