Golden Penguin: అరుదైన వార్తల్ని వెతికి మరీ ఇవ్వడంలో తెలుగు న్యూస్18 ముందుంటుంది. తాజాగా అలాంటి వార్తే ఇది. మన ఇళ్లలో కుక్కలు, పిల్లులకు రకరకాల రంగులు ఉంటాయి. అదే ఏ జీబ్రానో, జిరాఫీనో అయితే వాటికి ఎప్పుడూ ఒకే రకమైన రంగులు ఉంటాయి. అలాగే పెంగ్విన్లు కూడా నలుపు, బ్లూ కలర్, వైట్ కలర్‌తో ఉంటాయి. ప్రపంచంలోని అన్ని రకా పెంగ్విన్ల కలర్ అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం వేరే రంగు పెంగ్విన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. అది అదేనా అని డౌట్ పడదాం. ఉత్తర అమెరికాలోని దక్షిణ జార్జియాలో అదే జరిగింది. అక్కడి మంచు ప్రాంతంలో ఓ తెలుపు, పసుపు లేదా బంగారు వర్ణంలో మెరుస్తూ ఓ పెంగ్విన్ కనిపించింది.
బెల్జియంకి చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆడమ్... తన కెమెరాలో ఈ గోల్డెన్ పెంగ్విన్‌ను కాప్చర్ చేశారు. ఈ పెంగ్విన్... అటు నలుపు ఇటు తెలుపు రెండు రంగులూ లేకుండా ఎల్లో గోల్డెన్ కలర్లో మెరుస్తూ ఉండటాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆడమ్ కూడా మొదట దీన్ని చూసి షాకయ్యారట. ఇతర పెంగ్విన్లతో వేరే పక్షి ఏదైనా వచ్చి ఉందేమో అనుకున్నారట. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే... అది కూడా పెంగ్వినే అని అర్థమైంది. దాన్ని చూసి పర్యావరణ వేత్తలు, జంతు ప్రేమికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వారు కూడా ఎప్పుడూ అలాంటి దాన్ని చూడలేదు.
నిజానికి ఈ ఫొటో ఇప్పడు తీసినది కాదు. 2019లో ఆడమ్... తన పరిశోధనలో భాగంగా దక్షిణ జార్జియా వెళ్లారు. అక్కడి మంచులో చాలా పెంగ్విన్లు ఉన్నాయి. వాటిని ఫొటోలు తీస్తుండగా... ఈ కొత్త పెంగ్విన్ ఆకట్టుకుంది. అది అచ్చం మిగతా కింగ్ పెంగ్విన్స్ లాగే ప్రవర్తిస్తోందని ఆడమ్ తెలిపారు.
దేవుడే తనకు ఆ పెంగ్విన్ని చూపాడనీ... తాను అదృష్టవంతుడిని అని ఆడమ్ చెబుతున్నారు. 50 మీటర్ల దూరం నుంచి దాన్ని చూడగలిగనని అంటున్నారు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటి దాన్ని చూడలేదని చెబుతూ... దాని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇది కూడా చదవండి:God Airport: దేవుడికి అంకితమైన ఎయిర్పోర్ట్... ప్రపంచంలో ఇలాంటిది ఇదొక్కటే...
సౌత్ అట్లాంటిక్‌లోని దక్షిణ జార్జియాలో 1,20,000 దాకా కింగ్ పెంగ్విన్స్ ఉన్నాయి. ఆడమ్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పెంగ్విన్ అలా ఎందుకు ఉందో పరిశోధన చెయ్యాలని కొందరు అంటున్నారు. పర్యావరణ వేత్తలు కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:February 23, 2021, 12:33 IST