• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • RARE DISORDER KOLKATA WOMAN DISCOVERS SHE IS SUFFERING FROM TESTICULAR CANCER NK

ఆమె... ఆమె కాదు... అతడు... షాకైన డాక్టర్లు... అరుదైన వింత కేసుగా గుర్తింపు...

ఆమె... ఆమె కాదు... అతడు... షాకైన డాక్టర్లు... అరుదైన వింత కేసుగా గుర్తింపు...

ఆమె... ఆమె కాదు... అతడు... షాకైన డాక్టర్లు... అరుదైన వింత కేసుగా గుర్తింపు... (File - ప్రతీకాత్మక చిత్రం)

అప్పటివరకూ అంతా ఆమెను చూసి... ఆమె అనే అనుకున్నారు. తీరా డాక్టర్ల పరీక్షల తర్వాత... అతడు అని తెలిస్తే ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి పరిస్థితేంటి?

  • Share this:
    ఈ అరుదైన వింత కేసు బెంగాల్‌లోని కోల్‌కతాలో నమోదైంది. ఆమె వయసు 30 సంవత్సరాలు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లైంది. పిల్లలు పుట్టట్లేదు. చిన్నా చితకా క్లినిక్‌లకు వెళ్లి సమస్య చెప్పేది. డాక్టర్లు సలహాలు ఇచ్చేవారు. అవి అన్నీ పాటించేది. ఎన్ని చేసినా పిల్లలు మాత్రం లేరు. పైగా... అప్పుడప్పుడూ పొత్తి కడుపులో ఏదో తెలియని నొప్పి. ఎందుకో అర్థమయ్యేది కాదు. ఇక లాభం లేదని భర్త... ఈసారి పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మహిళా డాక్టర్లు ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లారు. పొట్టలో నొప్పి వస్తున్న చోట స్కాన్ వంటిది చేశారు. షాక్ అయ్యారు. ఆమె పొత్తికడుపులో టెస్టికల్స్ ఉన్నాయి. జనరల్‌గా మగవాళ్లకు మాత్రమే టెస్టికల్స్ ఉంటాయి. అవి ఆమెకు ఉండటంతో... ఆమె జన్యువుల DNAను పరిశీలించారు.

    మగవాళ్లకు DNAలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. మహిళలకు XX క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆమెకు... XY క్రోమోజోమ్స్ ఉన్నాయి. దాంతో... ఆమె... ఆమె కాదనీ... అతడు (మగవాడు) అనీ డాక్టర్లు తేల్చారు. అంతేకాదు... ఆమెకు మహిళలకు విడుదలైనట్లుగా అండాశయం విడుదల కాదని, అసలు గర్భాశయమే లేదని కూడా క్లారిటీగా చెప్పేశారు. దాంతో... షాకవ్వడం ఆమె, ఆమె భర్త వంతైంది.

    చిత్రమేంటంటే... ఆమె చూడటానికి అస్సలు మగవాళ్లలాగే లేదు. మహిళలాగే ఉంది. గొంతు కూడా మహిళలలాగే ఉంది. తన పరిస్థితి తెలుసుకొని... తనే షాకైంది. కంగారుపడొద్దన్న డాక్టర్లు... 22 వేల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పారు. ఇంతకీ ఆమెకు నొప్పి ఎందుకొస్తోందంటే... ప్రస్తుతం ఆమెకు టెస్టికల్ కాన్సర్ ఉందని డాక్డర్లు తేల్చారు. అది తగ్గేందుకు మందులు రాసిచ్చారు. భార్యాభర్తల్ని టెన్షన్ పడొద్దన్న డాక్టర్లు... ఇదివరకటిలాగే... కాపురం చేయమని సూచించారు. పిల్లల విషయంలో మాత్రం ఏ దత్తత విధానాన్నో పాటించాలని సూచించారు.

    ఈ కేసులో మరో ట్విస్ట్ ఉంది. ఆమె చెల్లెలికి 28 ఏళ్లు. ఆమెకు కూడా పిల్లలు పుట్టట్లేదు. అక్క పరిస్థితి తెలిశాక... తను కూడా అదే ఆస్పత్రిలో టెస్టులు చేయించుకుంది. డాక్టర్లు ఆమె కూడా మహిళ కాదనీ... మగవాడు అని చెప్పారు. పైగా... ఆమెకు ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అవేంటి డాక్టర్ అని అడిగితే... "నువ్వు బయటకు అమ్మాయిలా ఉంటాయి. లోపలేమో అబ్బాయిలా ఉంటావు. నీలో రెండు లక్షణాలూ కలిసి ఉంటాయి. అలాగని నువ్వు హిజ్రాల టైపు కాదు. నువ్వు మరో రకమైన మహిళా పురుషుడివి అని తేల్చారు. షాకవ్వడం ఆమె (అతని) వంతైంది.
    First published: