news18-telugu
Updated: August 10, 2020, 11:45 AM IST
ఏపీలో రైతులకు గరుడ పక్షి కనిపించిందా... వైరల్ వీడియో...
అది చిత్తూరు జిల్లా... బి.కొత్తకోట మండలం... డేగాని పల్లి. అక్కడ రోజూ లాగే... స్థానికులు... ఉదయాన్నే పంట పొలాలకు వెళ్లారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఓ చోట ఏదో కదులుతున్నట్లు అనిపించింది. "ఏందిరా అది"... అని ఓ కుర్రాడు అనగానే... "కుందేలులా ఉంది" అన్నాడు మరో కుర్రాడు. "కుందేలా... ఇక్కడికెందుకు కొచ్చింది. మన ఏరియాలో ఎప్పుడూ కనిపించలేదుగా" అన్నాడు. దగ్గరకు వెళ్లి చూద్దాం అనుకుంటూ... పొలం కదులుతున్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడో పెద్ద పక్షి... ఎగిరేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. "వార్నీ ఇది కుందేలు కాదు... పక్షి... ఏందిరా ఇది ఇంత పెద్దగా ఉంది... పట్టుకో పట్టుకో" అనుకుంటూ దాన్ని పట్టుకున్నారు.

పొలాల్లో కనిపించిన పక్షి.
చూడ్డానికి గద్దలా ఉంది అంటుంటే... ఓ వ్యక్తి దాన్ని గుర్తించి... అది గద్ద లాంటిదే... గద్దల్లోనే ఓ అరుదైన జాతి పక్షి అన్నాడు. అంటే ఏంది... ఇది పురాణాల్లో చెప్పిన గరుడ పక్షా... అన్నాడో పెద్దాయన. ఆ వ్యక్తి ఇది అక్విలిన్ (aquiline) జాతి పక్షి అన్నాడు. "ఏందోలే... చూడ్డానికి మాత్రం బాగుంది. చాలా పెద్దగా ఉంది. రెక్కల పొడుగు చూడు ఎంత పెద్దగుందో. మన ఏరియాలో గూడ కొంగలా లేదూ..." అనుకుంటూ... స్థానికులు దాన్ని రెండువైపులా పట్టుకున్నారు. అంది ఎంతకీ తల ఎత్తట్లేదు.
"ఏందిరా ఇది తల ఎత్తదే... ఓ సెల్ఫీ తీసుకుందామంటే... కిందకే చూత్తంది. పైకి తల ఎత్తితే బాగుండు... అనుకున్న స్థానికులు... కాసేపు పక్షితో సెల్ఫీలు తీసుకున్నారు. తర్వాత... దాన్ని జాగ్రత్తగా వదిలేశారు. ఆ పక్షి అలా ఎగిరిపోతుంటే... "చాలా ఆనందంగా ఉందబ్బా... ఎంత బాగా ఎగురుతుందో చూడు. అంత పెద్ద పక్షి మనకు ఎప్పుడైనా దొరికిందా. మన అదృష్టం. దానితో సెల్ఫీలు తీసుకున్నాం" అని సంబరపడ్డారు స్థానికులు.
Published by:
Krishna Kumar N
First published:
August 10, 2020, 11:45 AM IST