అమెరికా దిగ్గజ ర్యాపర్ వింత ప్రవర్తన...గ్రామీ అవార్డ్‌పై మూత్ర విసర్జన

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానంటూ ఉత్తుత్తి ప్రకటనలతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ దేశ దిగ్గజ ర్యాపర్ కాన్యే వెస్ట్(Kanye West) వింత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సారి తన గ్రామీ అవార్డుపై మూత్రవిసర్జన చేశాడు.

news18-telugu
Updated: September 18, 2020, 10:58 AM IST
అమెరికా దిగ్గజ ర్యాపర్ వింత ప్రవర్తన...గ్రామీ అవార్డ్‌పై మూత్ర విసర్జన
గ్రామీ అవార్డుపై మూత్రవిసర్జన చేసిన అమెరికా ర్యాపర్ కాన్యే వెస్ట్
  • Share this:
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానంటూ ఉత్తుత్తి ప్రకటనలతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ దేశ దిగ్గజ ర్యాపర్ కాన్యే వెస్ట్(Kanye West) వింత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. మ్యూజిక్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డు(Grammy Award)పై మూత్ర విసర్జన చేశాడు. ఇప్పటి వరకు అతను మొత్తం 21 గ్రామీ అవార్డులు గెలుచుకోగా...ఒక అవార్డును టాయ్‌లెట్‌లో వేసి దానిపై మూత్ర విసర్జన చేశాడు. తన వింత చేష్టలను స్వయంగా ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వైరల్ వీడియో నెటిజన్స్‌తో పాటు మ్యూజిక్ ప్రియులను షాక్‌కు గురిచేసింది.తాను రూపొందించిన మ్యూజిక్ హక్కులకు సంబంధించి కొన్ని మ్యూజిక్ సంస్థలకు - కాన్యే వెస్ట్ మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాన్యే వెస్ట్ ఈ చర్యకు పాల్పడ్డాడు. వర్తమాన మ్యుజిషియన్లను కట్టు బానిసల్లా మార్చారంటూ ట్విట్టర్ వేదికగా మ్యూజిక్ రికార్డింగ్ సంస్థలపై కాన్యే విరుచుపడ్డాడు. మ్యుజిషియన్లను ట్రాప్‌లోకి లాగి...వారిని శ్రమను దోపిడీ చేస్తున్నారంటూ ఆ అమెరికా ర్యాపర్ తీవ్ర ఆరోపణలు చేశాడు.

rapper kanye west, grammy award, kanye west urinates, urinates grammy award, amirica rapper, rapper kanye wife, కాన్యే వెస్ట్ మూత్రవిసర్జన, కాన్యే వెస్ట్ భార్య, అమెరికా ర్యాపర్
కాన్యే వెస్ట్ (ఫైల్ ఫోటో)


కారణం ఏమైనా అమెరికా ర్యాపర్ కాన్యే ఇలా చేయడం సరిగా లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుపై మూత్రవిసర్జన చేయడంపై ట్రోల్ చేస్తున్నారు. ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలిచేందుకే కాన్యే వెస్ట్ ఇలా చేస్తున్నారని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. కాన్యే మానసిక పరిస్థితి సరిగ్గా లేదని మరోసారి నిరూపితమైందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

మ్యూజిక్ రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ఈ గ్రామీ అవార్డును ఇస్తారు. గత 61 ఏళ్లుగా(1959 నుంచి) ఈ అవార్డును ‘ది రికార్డింగ్ అకాడమీ’ ప్రదానం చేస్తోంది.
Published by: Janardhan V
First published: September 18, 2020, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading