‘సింబా’ ట్రైలర్ టాక్..‘టెంపర్’ చూపించిన రణ్‌వీర్ సింగ్

జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ మూవీ నటుడిగా తారక్‌కు మరో మెట్టు పైకెక్కించింది. హిందీలో ఈ మూవీని రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: December 3, 2018, 1:37 PM IST
‘సింబా’ ట్రైలర్ టాక్..‘టెంపర్’ చూపించిన రణ్‌వీర్ సింగ్
‘సింబా’ ట్రైలర్ టాక్
news18-telugu
Updated: December 3, 2018, 1:37 PM IST
జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ మూవీ నటుడిగా తారక్‌కు మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మరోవైపు హిందీలో ఈ మూవీని రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ మూవీలో సైఫ్, అమృతాల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ చూస్తుంటే..తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ మూవీని హిందీ నేటివిటీకి తగ్గట్టు డైరెక్టర్ రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్‌ అజయ్ దేవ్‌గణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. శివఘడ్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన బాజీరావు సింగం తన విధులను ఎంతో నిజాయితితో నిర్వహిస్తుంటాడు. అతన్ని ప్రేరణ పొంది ఒక పిల్లాడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు.‘సింబా’గా రణ్‌వీర్ సింగ్


బాజీరావుల ఇతడు నీతి నిజాయితీ కోసం కాకుండా అవినీతి, అక్రమాలతో చెలరేగి పోతుంటాడు. అలాంటి అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్..ఎలా నిజాయితిగల పోలీస్ ఆఫీసర్‌గా ఎలా మారాడన్నదే ‘సింబా’ స్టోరీ.

సింబా ఫస్ట్ లుక్ పోస్టర్
Loading...
ఈ ట్రైలర్‌లో రణ్‌వీర్ సింగ్..అవినీతి పోలీస్ అధికారిగా.. ఆ తర్వాత నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్‌గా నటించిన సారా అలీ ఖాన్ లుక్స్ బాగున్నాయి. తెలుగులో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను హిందీలో సోనుసూద్ చేసాడు. హిందీలో పోసాని క్యారెక్టర్‌ను హిందీలో అశుతోష్ రాణా చేశాడు. ఇక బాజీరావు సింగంగా అజయ్ దేవ్‌గణ్ ఈ మూవీలో అతిథి పాత్రలో నటించాడు.

ఈ మూవీని డిసెంబర్ 28న న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈమూవీని ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌లో కరణ్ జోహార్ నిర్మించాడు.

Ranveer Singh Came to Simba Movie Shooting After Marriage.. కొత్త పెళ్లికొడుకు మ‌ళ్లీ షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. అలా పెళ్లి చేసుకున్నాడు.. ఇలా షూటింగ్‌కు వ‌చ్చేసాడు. ర‌ణ్‌వీర్ సింగ్ మ‌ళ్లీ "సింబా" సెట్లో క‌నిపించాడు. ఇంత త్వరగా షూటింగ్‌కు ఎలా వచ్చాడబ్బా అనిపించినా.. అక్కడ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పాపం కొత్త పెళ్లి కొడుకుకు దీపికను వదిలి రాక తప్పలేదు. డిసెంబర్ 28న "సింబా" విడుదల కానుంది. ranveer singh deepika padukone,ranveer singh marriage,ranveer singh simba movie,simba movie shooting,simba rohit shetty,ranveer singh simba rohit shetty,రణ్‌వీర్ సింగ్ సింబా,రణ్‌వీర్ సింగ్ దీపిక పదుకొనే,రణ్‌వీర్ సింగ్ పెళ్లి,రణ్‌వీర్ సింగ్ షూటింగ్,రణ్‌వీర్ సింగ్ సింబా మూవీ షూటింగ్,రణ్‌వీర్ సింగ్ రోహిత్ శెట్టి
సింబా రణ్‌వీర్ సింగ్


మరి తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘టెంపర్’ మూవీని హిందీ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
First published: December 3, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...