టాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు... రియా లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు

ఇప్పటివరకూ డ్రగ్స్ ఎపిసోడ్... బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంటే..., తాజాగా... టాలీవుడ్‌లోనూ డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

news18-telugu
Updated: September 12, 2020, 10:27 AM IST
టాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు... రియా లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు
రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్
  • Share this:
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మరణం చుట్టూ అల్లుకున్న డ్రగ్స్‌ కేసులో అరెస్టై బాలీవుడ్ నటి రియా చక్రవర్తి... మొత్తం 25 మంది సినీ ప్రముఖుల పేర్లను NCB అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. వాటిలో టాలీవుడ్ నటి... రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్ట పేర్లు ఉన్నట్లు బయటపడింది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వాడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే రియా చక్రవర్తితో రకుల్ ప్రీత్ సింగ్‌ ఎన్నోసార్లు కలిసి తిరిగింది. వాళ్లిద్దరూ కలిసి జిమ్‌లో వర్కవుట్లు చేసేవాళ్లు... అందువల్ల ఆటోమేటిక్‌గా రియాతో పరిచయంతో... రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వాడుతోందా అనే డౌట్లు వస్తున్నాయి.

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె కూడా డ్రగ్స్ వాడే ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. రియా చెప్పిన పేర్లతో ఓ లిస్టు తయారు చేసిన NCB అధికారులు.... డ్రగ్స్‌ వాడకంతో సంబంధం ఉన్న బాలీవుడ్‌ సెలబ్రిటీలను ప్రశ్నించందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

సెప్టెంబర్‌ 8 నార్కోటిక్స్‌ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ ఇప్పుడు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. వాళ్ల పిటిషన్లపై నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్, సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (NDPS) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్‌ విచారణ చేపట్టారు.

టాలీవుడ్‌లో ఇదివరకూ ఇలాగే డ్రగ్స్ ప్రకంపనలు సృష్టించాయి. దానిపై నెలల తరబడి దర్యాప్తు కొనసాగింది. చాలా మంది టాలీవుడ్ నటులు డ్రగ్స్ వాడినట్లు తేలింది. చివరకు వాళ్లందరూ డ్రగ్స్ బాధితులుగా తేల్చారు. ఇప్పుడు మరోసారి రకుల్ ప్రీత్ కారణంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో ఎంత మంది డ్రగ్స్ వాడుతున్నారన్నది ఇప్పుడు తేలాల్సిన అంశంగా కనిపిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: September 12, 2020, 10:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading