చెన్నైలో ఘనంగా రజనీకాంత్ కుమార్తె వివాహం..

news18-telugu
Updated: February 11, 2019, 1:12 PM IST
చెన్నైలో ఘనంగా రజనీకాంత్ కుమార్తె వివాహం..
సౌందర్య విశాగన్ దంపతులతో రజనీ దంపతులు..
news18-telugu
Updated: February 11, 2019, 1:12 PM IST
చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం నటుడు, వ్యాపారవేత్త విశాగన్‌తో సోమవారం ఘనంగా జరిగింది. దక్షిణ భారత సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరిపించారు. వివాహానికి తమిళనాడు సీఎం పళనిస్వామితో పాటు నటుడు కమల్ హాసన్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్ స్నేహితుడు నటుడు మోహన్‌బాబు కుటుంబ సమేతంగా వివాహానికి హాజరయ్యారు.

పెళ్లికి ముందు జరిగిన సంగీత్, మెహింది వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. వేడుకల్లో రజనీ సైతం స్టెప్పులు వేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, మొదటి భర్తతో విడాకుల అనంతరం విశాగన్‌‌ను ప్రేమించిన సౌందర్య.. పెద్దల అనుమతితో ఆయన్ను వివాహం చేసుకున్నారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...