హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Raksha bandhan: చిరుత పులికి రాఖీ కట్టిన మహిళ.. పిక్స్ వైరల్..

Raksha bandhan: చిరుత పులికి రాఖీ కట్టిన మహిళ.. పిక్స్ వైరల్..

చిరుతకు రాఖీ కడుతున్న మహిళ

చిరుతకు రాఖీ కడుతున్న మహిళ

Rajasthan: చిరుత పులి అడవిలో నుంచి బయటకు వచ్చింది. దాని ఒంటిపైన అనేక గాయాలయ్యాయి. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

దేశంతో పాటు, విదేశాల్లో ఉన్న వారు కూడా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. దూర ప్రాంతాలలో ఉన్న సోదరులు.. తమ సోదరి ఇంట్లోకి వెళ్లి ఆప్యాయంగా పలకరించి, ఎంతో వేడుకగా రాఖీ వేడుకలను జరుపుకున్నారు. ప్రధానంగా, సోదరీ, సోదరుల అనురాగానికి గుర్తుగా రాఖీ వేడుకను జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున ఈ వేడుకను నిర్వహించుకుంటారు. అయితే.. రాజస్థాన్ లో ఈ రోజు అరుదైన సంఘటన జరిగింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) అరుదైన సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న గ్రామంలోనికి ఒక చిరుతపులి వచ్చింది. దానికి ఒంటినిండా గాయాలయ్యాయి. కనీసం కదల్లేని స్థితిలో ఉంది. ఈ క్రమంలో.. అక్కడి గ్రామస్థులు చిరుతపులి (leopard)  దగ్గరకు చేరుకున్నారు. దానికి సపర్యలు చేశారు. అంతే కాకుండా.. ఒక మహిళకు ఒక అడుగు ముందుకేసి.. రక్షా బంధన్‌ రోజు (woman ties rakhi to leopard) తన అన్నయ్య ఈ విధంగా తన దగ్గరకు వచ్చాడని ఆనంద పడింది.

వెంటనే చిరుతపులి మణికట్టుకు రాఖీ కట్టి (Raksha bandhan) సంబరపడిపోయింది. మరికొందరు అక్కడికి చేరుకుని.. చిరుతపులి తో సెల్ఫీలు దిగారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. దీన్ని సుశాంత నంద, IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి, ఒక మహిళ అనారోగ్యంతో ఉన్న చిరుతపులి మణికట్టుకు రాఖీ కట్టిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మహిళ రాఖీ కట్టిన తర్వాత అనారోగ్యంతో ఉన్న చిరుతను అటవీ శాఖకు అప్పగించారు. అటవీ అధికారులు దాన్ని తీసుకుని వెళ్లారు. కాగా, భారతదేశంలో ఇప్పుడు 12,000 నుండి 14,000 చిరుతలు మాత్రమే ఉన్నాయి. వన్యప్రాణుల ప్రేమికులకు ఇది ఇంతకంటే దారుణంగా ఉండదని మీరు అనుకుంటే, మాకు మరో చెడ్డ వార్త ఉంది. చిరుతలు 1952లో దేశం నుండి అంతరించిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. చిరుత మాత్రమే అంతరించి పోయేదశకు చేరుకుంటుంది. గులాబీ తల బాతు, సుమత్రన్ ఖడ్గమృగంతో సహా ఈ దేశంలో ఇప్పుడు లేని ఇతర జీవులు కూడా ఉన్నాయి. మేము వారిని తిరిగి తీసుకురాలేము.. కానీ మిగిలిపోయిన వారిని రక్షించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు.

First published:

Tags: Leopard, Rajasthan, VIRAL NEWS

ఉత్తమ కథలు