కొందరు చలికాలంలో వేడి వేడి పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సాయంత్రం కాగానే ఫాస్ట్ ఫుడ్ లు, గప్ చుప్ లు, సమోసాలు, మిర్చిపాయింట్ ల వద్దకు వెళ్తుంటారు. ఇక మరికొందరు తమ స్నేహితులతో, ఫ్యామిలీలో కలిసి సరదాగా సాయంత్రంపూట స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే.. కొన్ని ప్రదేశాల్లో ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి.
తమకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ కోసం కస్టమర్ లు ఎంతటి దూరం నుంచైన వస్తుంటారు. దీంతో ఆయా ఫుడ్ రెసిపీ కి మంచి గిరాకీ ఉంటుంది. అయితే.. కొన్ని చోట్ల తక్కువ ధరకే మంచి పదార్థాలను అందిస్తుంటారు. దీంతో వారికి ఎప్పటికి గిరాకీ ఉంటుంది. అయితే.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో స్థానికంగా మిర్చిపకోడాకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం దీనికుండే క్రేజ్ వలన ఇది వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. రాజస్థాన్ లోని (Rajasthan) ఉదయ్ పూర్ లో 1967 నుంచి మిర్చిపకోడాకు అమ్ముతుంటారు. స్థానికంగా ఉన్న భువన సర్కిల్ సమీపంలో మిర్చిభవన్ ను విక్రయిస్తుంటారు. ఈ స్టాల్ ను 50 ఏళ్లకు పైగా నిర్వహిస్తున్నారు. అయితే.. అక్కడ పండిట్ జీ కుటుంబం 50 ఏళ్ల నుంచి మంచి క్వాలిటీ, టెస్ట్ తో కూడిన స్పైసీ మిర్చిపకోడాను విక్రయిస్తుంది. అసలే... చలికాలం ఆపైన ఇక్కడ మిర్చిపకోడాలకు మంచి గిరాకి ఉండటంతో ఎక్కువ మంది ఇక్కడకు వచ్చి మిర్చిలను తింటుంటారు. అంతేకాకుండా ఇది కూడా కేవలం 2 గంటలుమాత్రమే తెరిచి ఉంటుంది.
Shocking: చెత్తను వీధుల్లో వేసే వారికి షాక్.. ఉదయం 8 తర్వాత చెత్త వేస్తే రూ. లక్ష ఫైన్.. ఎక్కడంటే..
దీని కోసం కొన్ని గంటలు ముందుగానే ఫుడ్ లవర్స్ వచ్చి స్టాల్ ముందు క్యూలు కడుతుంటారు. పండిట్ జీ మిర్చిపకోడా అంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతో ఫేమస్. ఏళ్లతరబడి అక్కడ ప్రతిరోజు, కేవలం 2 గంటల్లోనే వెయికిపైగా మిర్చిలు అమ్ముడుపోతుంటాయి. ఒక్క పకోడా కేవలం 2రూపాయలకు దొరుకుంది.
ప్రతిరోజు సాయత్రం 6.30 నుంచి 8.30 వరకు విక్రయిస్తుంటారు. అయితే.. అక్కడ టెస్టీ మిర్చిపకోడా కోసం కనీసం కస్టమర్లు రెండు నుంచి మూడు సార్లు లైన్ లో ఉండి.. అనేక మిర్చిలను తీసుకెళ్తుంటారని స్థానికులు తెలిపారు. చుట్టు పక్కల ప్రాంతాలలో ఇంతటెస్టీ మిర్చిపకోడా.. అదికూడా ఇంత తక్కువ ధరకు లభించదని కూడా స్థానికులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajasthan, VIRAL NEWS