Lockdown - Viral Video: తిక్క కుదిరింది.. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారికి పోలీసుల వినూత్న శిక్ష.. వైరల్ అవుతున్న వీడియో చూడండి

నాగినీ డ్యాన్స్ చేస్తున్న యువకులు(ఫొటో: ట్విట్టర్)

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. అయితే ఎంత హెచ్చరిస్తున్నా.. కొందరు యువకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయితే లాక్ డౌన్ పాటించని ఇద్దరు యువకులకు పోలీసులు ఇచ్చిన వెరైటీ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Share this:
కరోనా మహమ్మారిని నిరోధించడానికి వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. అన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయినా కూడా చాలా మంది ప్ర‌జ‌లు కార‌ణం లేకుండా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పెడ‌చెవిన పెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాజ‌స్థాన్‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిని పోలీసులు ఊరికే వ‌దిలిపెట్ట‌డం లేదు. కొత్త రకం శిక్షలతో వారికి త‌గిన బుద్ధి చెబుతున్నారు. తాజాగా లాక్‌డౌన్ ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతున్న ఇద్దరు యువకులకు నాగిని డ్యాన్స్ చేయమని ఆదేశించారు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ‌స్థాన్‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లను ప‌ట్టించుకోకుండా రోడ్డుపైకి వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కుల‌ను పోలీసులు క్రియేటివ్‌గా శిక్షించారు. సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియోలో ఇద్ద‌రు యువ‌కులు రోడ్డు మ‌ధ్య‌లో నాగినీ డ్యాన్స్ చేస్తూ క‌నిపిస్తున్నారు. వీరిద్దరూ రాష్ట్రంలోని ఝ‌లావ‌ర్ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది.
Black Fungus: కోవిడ్-19, బ్లాక్ ఫంగ‌స్‌.. రెండూ ఒకేసారి సోకుతాయా? తప్పక తెలుసుకోండి
Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఖచ్చితంగా తెలుసుకోండి

ఎలాంటి కార‌ణం లేకుండా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి ఇంటి నుంచి బ‌య‌ట‌కొచ్చినవారిని అక్క‌డి పోలీసులు శిక్షిస్తున్నారు. రాత్రి స‌మ‌యంలో తీసిన ఈ వీడియోలో ఇద్ద‌రు యువ‌కులు రోడ్డు మ‌ధ్య‌లో నాగినీ డ్యాన్స్ చేశారు. వారు ఇబ్బందిపడుతున్నప్పటికీ, డ్యాక్స్ ఆపొద్దని పోలీసులు చెప్పారు. దీంతో.. బ‌య‌ట‌కి ఎందుకొచ్చాంరా దేవుడా... అన్న‌ట్లు ఆ యువ‌కులిద్ద‌రు కాసేపు డ్యాన్స్ చేశారు. దీన్ని అక్కడ ఉన్నవారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండొర్ జిల్లాలో ఒక త‌హ‌సీల్దార్ కూడా ఇలాంటి కొత్తరకం శిక్ష విధించారు. కోవిడ్ క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేసి బ‌య‌ట తిరుగుతున్న వారిని క‌ప్ప‌లా గెంతాలని ఆదేశించారు. ఈ వీడియో కూడా గతంలో వైరల్‌గా మారింది. ఇటీవల కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారితో ‘జై శ్రీరామ్’ అని డిక్టేషన్ రాయించారు మరో పోలీస్ ఆఫీసర్.
Published by:Nikhil Kumar S
First published: