చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు..ఇద్దరు అరెస్ట్

ఫేస్‌బుక్ ద్వారా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశం పంపిన ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.

news18-telugu
Updated: October 3, 2019, 2:12 PM IST
చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు..ఇద్దరు అరెస్ట్
సల్మాన్ ఖాన్ (file photo)
news18-telugu
Updated: October 3, 2019, 2:12 PM IST
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సోషల్ మీడియా ద్వారా చంపేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 16న ‘గ్యారీ షూటర్జ’ పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా నుంచి సల్మాన్ ఖాన్‌‌కు బెదిరింపు సందేశం అందింది. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ అందులో బెదిరించారు. ఈ బెదిరింపునకు సంబంధించి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్...రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా ఓ కారు దొంగతనం కేసులో లారెన్స్ బిష్నోయ్ అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ద్వారా అతను సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశం పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ప్రశ్నించగా పబ్లిసిటీ కోసమే సల్మాన్ ఖాన్‌కు బూటకపు బెదిరింపు సందేశాన్ని పంపినట్లు అతను అంగీకరించాడు.

salman khan news, bollywood gossips, bollywood latest news, facebook threat, threat to salman khan, సల్మాన్ ఖాన్, ఫేస్‌బుక్, బెదిరింపు సందేశం
సల్మాన్ ఖాన్‌కు సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపు సందేశం


ఈ బెదిరింపులో ప్రమేయమున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు స్థానిక రౌడీ షీటర్ సోపు ముఠాకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...