సాధారణంగా చాలా మందికి నదిలో దిగి స్నానం చేయడానికి, ఈతకొట్టడానికి ఇష్టపడతారు. కొన్ని సార్లు నదిలో దిగినప్పుడు అనుకొని ప్రమాదాలు జరుగుతాయి. కొందరు నదిలో ఈత రాకపోవడంతో మునిగిపొతారు. మరికొందరు నదీ ప్రవాహనికి అదుపు తప్పి కొట్టుకుపోతారు. అయితే,కొన్ని సార్లు.. నదిలో మొసళ్లు కూడా ఉంటాయి. అవి నీటిలో దిగిన వారిపై దాడులకు పాల్పడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలించింది.
పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) ఒక వ్యక్తి నదిలో ఈతకోసం వెళ్లాడు. అప్పుడు ఊహించని ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. రాజస్థాన్ లోని (rajasthan) లోని కోటలో షాకింగ్ ఘటన సంభవించింది. నదిలో స్నానం చేస్తున్నబిల్లూ అనే 38 ఏళ్ల వ్యక్తి పైకి ఒక (Crocodile) అకస్మాత్తుగా దాడిచేసింది. అందరు చూస్తుండగానే అతడిని నీళ్లలోనికి (river) లోకి లాక్కెళ్ళిపోయింది. అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే దాన్నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది గట్టిగా పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లిపోయింది.
చుట్టుపక్కల ఉన్న వారు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఖటోలి పట్టణంలో జరిగింది. స్థానికులకు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో.. పోలీసులు వెంటనే నది దగ్గరకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రప్పించారు. ఘటనను గురించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా, గజ ఈతగాళ్లు, ప్రత్యేక బోట్ లలో.. బాధితుడి కోసం గాలింపుచర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.