హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

నగరాన్నిఅందంగా.. నవ వధువు మాదిరిగా అలంకరించిన వ్యాపారి.. ఎందుకో తెలుసా..?

నగరాన్నిఅందంగా.. నవ వధువు మాదిరిగా అలంకరించిన వ్యాపారి.. ఎందుకో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: నగరమంతట లైట్ లు పెట్టించాడు. అంతే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన వస్తువులను, సామాగ్రిని తెప్పించి మరీ కూడలిల వద్ద అందంగా డెకొరేట్ చేశారు.

  • Local18
  • Last Updated :
  • Rajasthan, India

ప్రతి ఒక్కరు తమ పెళ్లి (Wedding)  వేడుకను జీవితంలో మర్చిపోలేని విధంగా జరుపుకొవాలని ప్లాన్ లు వేసుకుంటారు. దీని కోసం అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేయాలని అనుకుంటారు. తమ కూతురు పెళ్లి కోసం ఎంత ఖర్చుచేయడానికైన వెనుకాడరు. దీనికోసం కొందరు ఈవేంట్ ఆర్గనైజర్ లను కూడా సంప్రదిస్తారు. పెళ్లికి (Marriage) సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం.. పెళ్లి చూపుల నుంచి, ప్రీవెడ్డింగ్ షూట్, మెహందీ, హల్దీ, సంగీత్ ఇలా ప్రతి కార్యక్రమంలో ఎంతో గ్రాండ్ గా ఉండేలా చూస్తారు. ఈ కోవకు చెందిన ఒక పెళ్లి వేడుక ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..రాజస్థాన్ లో (Rajasthan)  జరిగిన ఒక పెళ్లివేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోలి ప్రాంతానికి చెందిన వ్యాపారి అశోక్ సింగ్ ధాబాయ్ తన కూతురు పెళ్లిని ఎంతో వైభవంగా జరిపించాడు. దీని కోసం ఆయన పెళ్లి మండపాన్ని మాత్రమే కాకుండా.. పూర్తిగా తాము ఉంటున్న నగరాన్ని విద్యుత్ లైట్లతో ఎంతో గ్రాండ్ గా అలకంరించారు. అంతే కాకుండా.. రోడ్లకు ఇరువైపుల, కూడళ్ల దగ్గర కూడా లైట్లను అమర్చారు. దీంతో నగరమంతా ఒక పెద్ద కార్యక్రమం ఏదైన చేస్తున్నారా అంటూ చర్చించుకున్నారు.

నగరవాసులంతా ఎంతో మంది కూడా తమ కూతురి కోసం ఒక వ్యాపారి ఈ విధంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించాడని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లివేడుక మాత్రం సోషల్ మీడియాలో (Social media)  తెగ ట్రెండింగ్ (Trending)  గా మారింది. దీనిపై వ్యాపారి అశోక్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ కూతురు పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకుంటారని అన్నారు. అంతేకాకుండా.. తాను కూడా తన కూతురు పెళ్లిని ఈ విధంగా అందరికి తెలిసేలా గ్రాండ్ గా డెకొరేట్ చేయించానంటూ తెలిపాడు.

First published:

Tags: Rajasthan, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు