కొందరు స్వామిజీలు, నాయకులు గ్రామాల్లోకి వెళ్లి అనేక అంశాలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే.. గ్రామాల్లోని ప్రజలు ఎవరైన తమ ఊరికి వచ్చి ఆసక్తికరంగా ఉపన్యాసం చెప్తుంటే ఎంతో శ్రద్ధగా వింటుంటారు. కొంత మంది వినడం వరకు మాత్రమే ఉంటే.. మరికొందరు వినడంమాత్రమే కాకుండా ఆచరణలోను పాటించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే.. రాజస్థాన్ లోని రతన్ గఢ్ జిల్లాకు వచ్చిన ఒక మహారాజ్ స్పీచ్ విని ఒక వ్యక్తి తెగ అట్రాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం 23 ఏళ్లుగా అతను చేస్తున్న పని ప్రస్తుతం వార్తలలో (Viral) నిలిచింది.
పూర్తివివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) రతన్ గఢ్ జిల్లాలో 23 ఏళ్ళ క్రితం ఒక కార్యక్రమం జరిగింది. రతన్ గఢ్ జిల్లాలో రామ్ సుఖ్ దాస్ మహారాజ్ అనే వ్యక్తి వచ్చి గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో ఆయన సమావేశానికి అనేక మంది స్థానికులు హజరయ్యారు. అయితే.. ఆ సమావేశానికి హుద్దెరా గ్రామానికి చెందిన గోపాల్ రామ్ ప్రజాపత్ అనే వ్యక్తి కూడా హజరయ్యాడు. అతను టైలరింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే రామ్ సుఖ్ దాస్.. వెంట్రుకలు పెంచుకోవడం వలన ఎన్నో ఉపయోగాలున్నాయని, ప్రతిరోజు వెంట్రుకలను (Hair) అల్లడం వలన ఎన్నో లాభాలున్నాయని అన్నారు.
ఈ మాటలకు గోపాల్ రామ్ అట్రాక్ట్ అయ్యాడు. ఆయన తాను కూడా తన జుట్టును పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి అంతే.. 23 ఏళ్లుగా జుట్టును పెంచడం ప్రారంభించాడు. ప్రస్తుతం జుట్టు.. 5 అడుగుల 2 అంగుళాల పొడవు పెరిగింది. గోపాల్ రామ్ జుట్టును చూడటానికి చుట్టుపక్కల గ్రామాస్థులు వస్తుంటారు. జుట్టు బలంగా పెరగడానికి నెలకు 500 రూపాయలు ఖర్చవుతుందని తెలిపాడు.
అంతే కాకుండా ఇప్పటిదాక సుమారు సుమారు లక్షా 40 వేల రూపాయలకు ఖర్చయిందని కూడా చెప్పాడు. అయితే.. జుట్టు కోసం ప్రతివారంలో ఒక రోజు ముల్తానీ మిట్టి పెడతానని, అదే విధంగా వేప నీళ్లతో కూడా కడుగుతానని తెలిపాడు. ప్రస్తుతం.. జుట్టు జడల మాదిరిగా పెద్దదిగా మారిందని, కనీసం సరిగ్గా నిద్రకూడా పోవట్లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించం తన టార్గెట్ అన్ని గోపాల్ రామ్ అన్నారు. బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకొవడానికి ఇబ్బందికరంగా మారిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajasthan, VIRAL NEWS