హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వారెవ్వా.. పెళ్లంటే ఇది.. కట్నంగా ఒక రూపాయి, కొబ్బరికాయ.. ఎక్కడో తెలుసా..?

వారెవ్వా.. పెళ్లంటే ఇది.. కట్నంగా ఒక రూపాయి, కొబ్బరికాయ.. ఎక్కడో తెలుసా..?

వైభవంగా జరిగిన పెళ్లి వేడుక

వైభవంగా జరిగిన పెళ్లి వేడుక

Rajasthan: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. అమ్మాయి తరపు వారు పెళ్లి లో వరుని తరపు వారు అతిథుల కోసం.. అనేక రకాల ఏర్పాట్లను చేసి, ఎప్పటికి గుర్తుండిపోయేలా పెళ్లి వేడుక జరిపించారు.

  • Local18
  • Last Updated :
  • Rajasthan, India

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే.. నేటి యువత, తమ పెళ్లి వేడుక ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటున్నారు దీని కోసం ఎంత ఖర్చు అయిన వెనుకాడటంలేదు. ఎవరి హోదాలకు తగ్గట్టుగా వారు అరెంజ్ మెంట్స్ ను చేసుకుంటున్నారు. అంతే కాకుండా.. మరికొందరు వారి ఉద్యోగాలు, ఆస్తిపాస్తులకు సంబంధించి, భారీగానే అమ్మాయి తరపు వారి నుంచి కట్నకానుకలను ఆశిస్తున్నారు. మరొవైపు వధువు తరపు వారుకూడా, అమ్మాయి మంచి ఇంట్లో పడితే చాలని అప్పోసప్పో చేసి వరుడి తరపు వారు అడిగినంత కట్నం ఇస్తున్నారు.

కానీ మరికొందరు మాత్రం.. కేవలం మంచి అమ్మాయి దొరికితే చాలు.. కట్నం ఎందుకులే అని.. అనే వాళ్లు కూడా లేకపోలేదు. అంతే కాకుండా.. కట్నంన కోసం వధువు తరుపు వారిని పీక్కుతీనడం మంచిది కాదనే ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవారు కూడా అప్పుడప్పుడు వార్తలలో ఉంటున్నారు. సాదుల్ పూర్ లో జరిగిన పెళ్లి వేడుకలో కేవలం ఒకరూపాయి , కొబ్బరికాయ తీసుకుని వైభవంగా పెళ్లి వేడుకను జరిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు... రాజస్థాన్ (Rajasthan) లోని సాదుల్ పురలో జరిగిన పెళ్లి వేడుక వార్తలలో నిలిచింది. స్థానికంగా.. సాదుల్‌పూర్‌కి చెందిన ఆదిత్య, రోహ్‌తక్‌ నివాసి ఏక్తా మాలిక్‌లకు ఇటీవల వివాహం జరిగింది. వరుడి తండ్రి పూనియా, తల్లి సంజయ్ పూనీయా పెళ్లివేడుకలో కేవలం ఒకరూపాయి, కొబ్బరికాయను కట్నంగా తీసుకున్నారు. అంతే కాకుండా... తాము వరకట్నం తీసుకొవడానికి పూర్తిగా విరుద్ధమని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా వధువు తరపు వారిని పీడించి, కట్నం తీసుకొవడం తమకు ఇష్టంలేదంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఆడపిల్లకు మించిన ఆస్తి లేదన్నారు. పెళ్లి తర్వాత.. కొడుకు,కోడలుని ఎంతో ప్రేమతో, ఆశీర్వదించి, తమ ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పెళ్లి కొడుకు వారు ఇలా రూపాయి, కొబ్బరికాయ తీసుకొవడం వార్తలలో నిలిచింది.

ఈ వివాహానికి హజరైన పలువురు ప్రజాప్రతినిధులు..

ఈ పెళ్లికి పలువురు రాజకీయ నాయకులు హజరయి కొత్త జంటను ఆశీర్వదించారు. వివాహా వేడుకకు... తారానగర్ ఎమ్మెల్యే నరేంద్ర బుడానియా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణ పూనియా, మాజీ ఎమ్మెల్యే మనోజ్ న్యాంగలి చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వీరేంద్ర పూనియా, మాజీ ఎమ్మెల్యే నంద్లాల్ పూనియా, ఇంద్ర సింగ్ పూనియా, మల్పురా ఎమ్మెల్యే రణవీర్ సింగ్ పెహల్వాన్, అమర్‌పురా ధామ్‌కి చెందిన మహంత్ సురేంద్ర సింగ్ రాథోడ్ హజరయ్యారు. అంతే కాకుండా... ప్రొఫెసర్ దిలీప్ సింగ్ పూనియా, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అనుప్ కుమార్ బఘేలా, జాట్ మహాసభ పోషకుడు చౌదరి భలేరామ్ పూనియా, బీజేపీ నేత రాకేష్ జంగీద్ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

First published:

Tags: Rajasthan, VIRAL NEWS, Wedding