Home /News /trending /

RAIN ALERT TO TELANGANA IMD FORECAST RAIN IN TELANGANA FOR THREE DAYS COLD WAVE IN ANDHRA MKS

Rain Alert: తెలంగాణను కమ్మేసిన మేఘాలు.. రాబోయూ 3రోజులు వర్షాలు.. APలో పెరిగిన చలి తీవ్రత: IMD

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ విభాగం వేర్వేరు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత పెరిగింది. వివరాలివి..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ విభాగం వేర్వేరు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను మేఘాలు కమ్మేశాయి. రాష్ట్రంలో పలు చోట్ ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

శివరాత్రికి ఇంకా సమయం ఉన్నా, తెలంగాణలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఖమ్మం, మెదక్‌, హనుమకొండ జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో 30 డిగ్రీల కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. మరోవైపు,

Nakkapalle: అన్నయ్యా.. ప్లీజ్ వదులన్నా.. నోట్లో గుడ్డలు కుక్కి.. తల్లి, సోదరి నగ్న వీడియోలు కావాలంటూ.. విశాఖలో దారుణం



తెలంగాణలో చలి తీవ్రత తగ్గిపోతుండగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. కళింగపట్నం, నందిగామలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది.

Prashant Kishor కాంగ్రెస్‌లో చేరేవారే: అసలేం జరిగిందో చెప్పిన Priyanka Gandhi



దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ శనివారం వర్షాలు కురిసే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం తగ్గినట్లు కనిపించడం లేదు. ఉదయం వేళ కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, IMD, Imd hyderabad, Rain alert, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు