Railways transport passenger buses: భారతీయ రైల్వేలో గూడ్స్ రైళ్లది చాలా కీలక పాత్ర. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైక్ లు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం తదితర వాహనాలను కూడా గూడ్స్ రైళ్ల ద్వారా తరలిస్తుంటారు. తాజాగా భారతీయ రైల్వే మరో ఘనతను సాధించింది. ఇప్పటి వరకు గూడ్స్ రైళ్లలో ట్రాక్టర్లు, బైక్లు తరలించగా.. తాజాగా బస్సులను రవాణా చేసింది. చరిత్రలోనే తొలిసారి ఆర్టీసీ బస్సులను రవాణా చేసి సరికొత్త అధ్యయనానికి తెర తీసింది భారతీయ రైల్వే. బెంగళూరు నుంచి పంజాబ్ రాజధాని చండీగఢ్ కు రెండు దఫాల్లో బస్సులను తరలించింది. ఆర్టీసీ చెందిన బస్సులను గూడ్స్ రైళ్లలో తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.
బెంగళూరులోని అశోక్ లేలాండ్ సంస్థ 300 బస్సుల ఉత్పత్తికి హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని బెంగళూరులో వీటిని తయారు చేశారు. అయితే రోడ్డు మార్గంలో బస్సులను తరలించాలంటే భారీగా ఖర్చవుతుంది. దీనికి తోడు ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ద్వారా చవకగా రవాణా చేయొచ్చని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో గూడ్స్ రైలులో తక్కువ ఖర్చుతో బస్సులను అశోక్ లేలాండ్ రవాణా చేసింది. బస్సులు తయారైన బెంగళూరులోని దొడ్డబళ్లాపుర నుంచి చండీగఢ్ వరకు 2,825 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరుకునేందుకు 5 రోజుల సమయం పడుతుంది. ఈ కారణంగానే బస్సులను రైలులో రవాణా చేశారు.
Buses on Train!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 18, 2022
Transporting passenger buses for the first time. pic.twitter.com/QWggwXfww1
మే 15న 32 బస్సులు... మే 20న మరో 32 బస్సులను రైలులో రవాణా చేసింది అశోక్ లేలాండ్. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ కు రోడ్డు మార్గంలో బస్సులను తరలిస్తారు. భారత రైల్వేలో బస్సులను రవాణా చేయడం ఇదే తొలిసారి. ఈ రవాణా ద్వారా కొత్త మైలురాయిని చేరినట్లు సౌత్ వెస్టర్న్ రైల్వే ట్వీట్ చేసింది. ‘బెంగళూరు నుంచి ఆటోమొబైల్ రవాణాలో సరికొత్త మైలురాయి’ అంటూ సౌత్ వెస్ట్రన్ రైల్వే ట్వీట్ చేసింది. ఆర్టీసీ చెందిన బస్సులను గూడ్స్ రైళ్లలో తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India Railways, RTC buses