RAILWAY POLICE VIDEO OF A BOY COMMITTING SUICIDE BY JUMPING ON A RAILWAY TRACK IN MAHARASHTRA GOES VIRAL SNR
Video Viral:ఒక్క నిమిషంలో ట్రైన్ మిస్సైంది.. లేదంటే అతను ఏమై ఉండేవాడో తెలుసా..
(Photo Credit:Youtube)
Video Video: 18ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఫ్లాట్‌ఫామ్‌పై డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి కుర్రాడ్ని రైలు ఢీకొట్టక ముందే కాపాడాడు. మహరాష్ట్ర విఠల్వాడి రైల్వే స్టేషన్లో ఈఘటన జరిగింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
రైల్వేస్టేషన్(Railway Station)లో పెద్దగా జనం లేరు. ప్లాట్‌ఫామ్ (Platform)దగ్గర ఓ 18ఏళ్ల యువకుడు(18years) ఎదురుచూస్తున్నాడు. అందరూ ట్రైన్ కోసమే అనుకున్నారు. డ్యూటీలో ఉన్న రైల్వే పోలీస్ కూడా అదే అనుకున్నాడు. అయితే ఆ బాలుడి కదలికలు చూస్తే మాత్రం కొంచెం తేడాగా ఉండటంతో ఫ్లాట్‌ఫామ్‌పై తిరుగుతున్న కానిస్టేబుల్ కొద్దిగా ముందుకు వెళ్లి అతడ్ని గమనిస్తూ ఉన్నాడు. స్టేషన్ సమీపంలోకి ట్రైన్ వస్తుండటం గమనించాడు యువకుడు. ఫ్లాట్‌ఫామ్‌పై నిల్చుకున్న కుర్రాడు కాస్తా కిందకు దూకి రైలు పట్టాలపై దూకి రైలుకు అడ్డంగా నిల్చున్నాడు.సరిగ్గా రైలు ఆ యువకుడ్ని ఢీకొట్టే సమయానికి ముందే రైల్వే పోలీస్ వెనుక నుంచి వచ్చి అతడ్ని పక్కకు నెట్టివేయడంతో ప్రాణాలతో బయపడ్డాడు. ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించిన దృశ్యాలు ఫ్లాట్‌ఫామ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra) థానే (Thane) జిల్లాలోని విఠల్వాడి (Vithalwadi)రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. చావాలనుకున్న యువకుడ్ని ప్రభుత్వ రైల్వే పోలీస్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి కాపాడటంతో అక్కడున్న వాళ్లందరు ప్రశంసించారు. ఓ రైల్వే పోలీస్ అంత బాద్యతగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా రైల్వే పోలీస్ చేసిన సహసాన్ని చూసి అభినందిస్తున్నారు. వీడియోకి లైక్‌లు, షేర్ చేస్తూ పోలీస్ సర్వీస్‌ని మెచ్చుకుంటున్నారు.
రెప్పపాటులో తప్పిన చావు..
విఠల్వాడి రైల్వే స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే మధుర ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వచ్చే ఫ్లాట్‌ఫారమ్ దగ్గర వెయిట్ చేశాడు. రైల్వే ప్లాట్‌ఫారమ్ దగ్గర 18 ఏళ్ల బాలుడు అనుమానంగా తిరుతుండటం గమనించిన హృషిక్ మనేనిని రక్షించడానికి వచ్చాడు కానిస్టేబుల్. తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఓ బాలుడ్ని రక్షించడంపై రైల్వేశాఖ అధికారులు సైతం అతడ్ని అభినందించారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన వీడియోని పశ్చిమ రైల్వే సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యాయత్నం)
గ్రేట్ పోలీస్..
కుర్రాడ్ని కాపాడిన అనంతరం రైల్వే పోలీసులు ఎందుకు చనిపోవాలనుకున్నావని ప్రశ్నించారు. అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో రైల్వే అధికారులు బాలుడ్ని తల్లిదండ్రుల్ని సమాచారం అందించారు. కళ్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించారు అధికారులు. నాలుగు మంచి మాటలు చెప్పి ఎంతో సాధించాల్సిన కుర్రాళ్లు ఇలా క్షణికావేశంలో చిన్న చిన్న చికాకులతో బలవన్మరణాలకు పాల్పడకూడదని హితవు పలికారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.