Video : ఇండియాలో తొలి అండర్ వాటర్ ట్రైన్... రైల్వే మంత్రి ఆసక్తికర ప్రకటన...

Indian Railways : భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయా? ఈస్ట్-వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగంగా... కోల్‌కతా ఈస్ట్ నుంచీ వెస్ట్ పసిగామా వరకూ భారత తొలి అండర్ వాటర్ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 12:43 PM IST
Video : ఇండియాలో తొలి అండర్ వాటర్ ట్రైన్... రైల్వే మంత్రి ఆసక్తికర ప్రకటన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Under Water Train : ఇప్పటివరకూ మనం పట్టాలపై, అండర్ గ్రౌండ్‌లో వెళ్లే రైళ్లను ఏర్పాటుచేసుకున్నాం. అలాగే మెట్రో రైళ్లూ వచ్చాయి. ఇక ఇప్పుడు నీటిలో దూసుకెళ్లే అండర్ వాటర్ రైళ్లు రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యేక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రైల్వే మంత్రి పియూష్ గోయల్. ఆ వీడియో ప్రకారం... చైనా లాగే... ఇండియా కూడా త్వరలోనే అండర్ వాటర్ ట్రైన్‌ను పరుగులు పెట్టించబోతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఈ ప్రాజెక్టును తొలిసారిగా కోల్‌కతాలోని హుగ్లీ నదిలో చేపట్టనున్నట్లు పియూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హౌరా, మహాకర్న్ వంటి రైల్వే స్టేషన్లకు అండర్ వాటర్ ట్రైన్ టచ్ చెయ్యనుంది. ఈస్ట్-వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్... దీన్ని చేపట్టనుంది. పసిగామా, ఈస్ట్ కోల్‌కతా మధ్య హుగ్లీ నదిలో 16.6 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్ రాబోతోంది. ఇందులో 10.6 కిలోమీటర్ల మార్గంలో ట్రైన్... నదిలోని సొరంగంలో వెళ్తుంది. ఇందుకోసం నదిలో 520 మీటర్ల లోతున సొరంగాన్ని నిర్మించనున్నారు.




గంటకు 80 కిలోమీటర్ల వేగంతో అండర్ వాటర్ ట్రైన్ వెళ్లనుంది. హౌరా నుంచీ మహాకరన్‌కి అది కొన్ని నిమిషాల్లోనే వెళ్లనుంది. ఇందుకోసం రూ.900 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో రూ.60 కోట్లను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిన తర్వాత... దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ అండర్ వాటర్ ట్రైన్ల ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం చుడుతుందని తెలిసింది.
First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు