రైల్వే స్టేషన్‌లో జాగ్రత్తగా ఉండాలంటూ రైలు సిబ్బంది అనౌన్స్‌మెంట్స్ చేస్తూనే ఉంటారు. రైలు వచ్చే సమయంలో అనేక జాగ్రత్తలు చెబుతుంటారు. ప్లాట్‌ఫామ్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండాలని రైల్వే సిబ్బంది చెబుతూనే ఉంటారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కూడా ప్రయాణికులను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. రైల్వే సిబ్బంది ఇన్ని చేస్తూన్నా ప్రయాణికులు అజాగ్రత్తగా ఉంటూ ప్రమాదాలబారిన పడుతుంటారు. అలాంటి ఘటనే సెంట్రల్ రైల్వే పరిధిలోని వంగని రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఓ తల్లి తన కొడుతో కలిసి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఆ అబ్బాయి ప్లాట్‌ఫామ్‌పై చూసుకోకుండా ముందుకు వెళ్తూ కాలుజారి రైలు పట్టాలపై పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా రైలు వస్తోంది. ఆ రైలు రైల్వే స్టేషన్‌లోకి వచ్చేసింది. ఆ అబ్బాయి ఎంత ప్రయత్నించినా రైలు పట్టాలపైకి ఎక్కడం సాధ్యం కాలేదు. ఆ తల్లి ప్లాట్‌ఫామ్‌పైనే కంగారు పడుతోంది. ఇంతలో రియల్ హీరో వచ్చాడు. పట్టాలపై వేగంగా పరుగెత్తి చిన్నారిని ప్లాట్‌ఫామ్ పైకి ఎక్కించాడు. రైలు దూసుకొచ్చేలోగా తను కూడా ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేశాడు. ఇదంతా కేవలం 20 సెకండ్లలో జరిగింది. ఆ వీడియోను భారతీయ రైల్వే ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.
Video: ఆ ప్రయాణికుడి అదృష్టం బాగుంది... విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఎలా బతికిపోయాడో చూడండి
Indian Railways: ఇంత పొడవైన గూడ్స్ రైలు మీ జీవితంలో చూసి ఉండరు (Video)
A Good Samaritan:
At Vangani station of Central Railway, Pointsman Mr. Mayur Shelkhe saved the life of a child just in the nick of the time. He risked his life to save the life of the child.
We salute his exemplary courage & utmost devotion to the duty. pic.twitter.com/V6QrxFIIY0
— Ministry of Railways (@RailMinIndia) April 19, 2021
హీరోలా దూసుకొచ్చి ఆ చిన్నారిని కాపాడిన వ్యక్తి పేరు మయూర్ షేల్ఖే. సెంట్రల్ రైల్వేలో పాయింట్స్‌మ్యాన్. సరిగ్గా అదే టైమ్‌కు అక్కడే అతను ఉండటంతో ఆ చిన్నారి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికి కూడా భయమేస్తుంది. ఆ చిన్నారిని పట్టాలపై చూసిన 10 సెకండ్లలో పరుగెత్తుకుంటూ వచ్చి కాపాడిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా రైల్వే ఉద్యోగి సాహసాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. రైల్వే మంత్రి మాత్రమే కాదు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడిన తీసు చూసి ప్రతీ ఒక్కరూ ఆ రైల్వే ఉద్యోగి సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, Railways, Train, Trending videos, Viral, Viral in internet, VIRAL NEWS, Viral tweet, Viral Video, Viral Videos