Home /News /trending /

RAHUL SAHU RESCUE 10 YEAR OLD BOY WHO HAD FALLEN INTO BOREWELL IN CHHATTISGARH RESCUED ALIVE VIDEO GOES VIRAL PAH

నిజంగా ఇది వింతే.. 104 గంటలపాటు బోరు బావిలో చిక్కుకున్న దివ్యాంగుడు.. చివరకు ఏం జరిగిందంటే..

బాలుడిని బయటకు తీసుకొస్తున్న అధికారులు

బాలుడిని బయటకు తీసుకొస్తున్న అధికారులు

Bihar: బాలుడికి మాటలు రావు. అయిన తల్లిదండ్రులు తమ పిల్లాడిని కంటికి రెప్పలా చూసు కుంటారు. ఇంట్లోనే ఎక్కువగా ఆడుకుంటాడు. ఒక రోజు ఇంటి వెనుకాల ఉన్న పెరడులో ఆడుకొంటున్నాడు.

కొందరు నీళ్ల కోసం ఎడాపెడా బోర్లను వేస్తుంటారు. ఈ క్రమంలో నీళ్లు పడకపోతే మాత్రం.. దాన్ని మూసేయడంలో తీవ్ర అశ్రద్ధ చూపిస్తారు. కొన్ని సార్లు.. వీరి అజాగ్రత్తల వలన నిండు ప్రాణాలు బలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పొలాలల్లో రైతులు బోర్లు వేసి, మరల దాన్ని వదిలేయడం వలన ప్రాణాలు దానిలో చిన్నారులు పడిపోయిన సంఘటలనలు కొకొల్లలు. కొన్ని సార్లు.. పిల్లలు చనిపోతే.. మరికొన్ని సార్లు.. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, సైనికులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అనేక గంటల పాటు శ్రమించి, బోరు బావిలో పడిన వారిని మరల కాపాడారు. ఇలాంటి ఎన్నో ఉదంతాలు గతంలో వార్తలలో నిలిచాయి. తాజగా, ఈ కోవకు చెందిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్ గఢ్ జిల్లా (Chhattisgarh) లో షాకింగ్ ఘటన జరిగింది. జంజ్ గిరి జిల్లాలోని పిహ్రిద్ గ్రామంలో ఈ అనుకొని సంఘటన గల మంగళవారం జరిగింది. రాహుల్ సాహు అనే 10 ఏళ్ల పిల్లాడు తమ ఇంట్లో ఆడుకుంటున్నాడు. అతను మూగవాడు. దీంతో ఎక్కువగా ఇంట్లోనే ఉంటాడు. అతని తల్లిదండ్రులు తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడు కుంటున్నారు. అయితే, ఈనెల 10 న బాలుడు, ఆడుకుంటు వెళ్లి పెరటులోని బోరు బావిలో (fallen into borewell)  పడ్డాడు. చాలా సేపు అవుతున్న, తమ బాలుడు రాకపోవడంతో అక్కడికి వెళ్లి చూశారు. ఆ తర్వాత.. బోరు బావిలో వింతైన శబ్దాలు రావడంతో అక్కడ వెళ్లి చూశారు. బోరులో తమ పిల్లాడు పడినట్లు నిర్దారించు కున్నారు.





వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు.. ఎన్డీఆర్ఎఫ్ , ఆర్మీ అధికారులు సహాయం తీసుకున్నారు. వారు రంగంలోనికి దిగి బాలుడు, 60 అడుగుల లోతున్న ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అత్యధిక పరికరాలను ఉపయోగించారు. బోరులో ఆక్సిజన్ సిలెండర్ పంపించారు. అదే విధంగా జ్యూస్ లు, తినేవి పంపించారు. ఈ క్రమంలో ఆపరేషన్ వేగవంతం చేశారు. దాదాపు.. నాలుగు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించారు. దివ్యాంగ బాలుడు బోరుబావిలో పడిన ఘటన వార్తలలో నిలిచింది. దీనిపై ముఖ్య మంత్రి భూపేశ్ భగేల్ (Bhupesh Baghel)  ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశారు.



ఈ క్రమంలో అధికారులు ఎంతో చాకచక్యంగా  (Rescue Operation)  ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత.. మంగళవారం రాత్రి బాలుడిని కేమంగా బయటకు తీశారు. వెంటనే బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలుడు క్షేమంగా బయట పడటంతో ముఖ్యమంత్రి ఆర్మీ అధికారుల వ్యవహరించిన తీరును కొనియాడారు. ట్విటర్ (Twitter)  ద్వారా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించారు. బాలుడి కుటుంబానికి తమ వంతుగా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం బాలుడిని రెస్క్యూ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Borewell, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు