ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి (Rahul gandhi) మరో ఝలక్ ఇచ్చారు. మరోసారి రేపు తమ ఎదుట హజరు కావలని ఈడీ అధికారులు తాజాగా సమన్లు జారీచేశారు. కాగా, ఇప్పటికే రాహుల్ గాంధీని మనీలాండరింగ్ కేసులో.. ఈడీ (Enforcement directorate) గత నాలుగు రోజులుగా.. సుమారు 40 గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఈడీ సమన్లు జారీ చేయడంతో కాంగ్రెస్ (Congress) నేతల్లో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగో రోజు కూడా ప్రశ్నిస్తన్నారు. ఈ నేపథ్యంలో.. రేపు (మంగళవారం) కూడా ఆయన తమ ఎదుట హజరు కావాలని ఈడీ సమన్లు పంపినట్లు తెలిసింది.
వయనాడ్ ఎంపీని ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో 40 గంటల పాటు ప్రశ్నించారు. గత వారం సోమవారం నుంచి బుధవారం వరకు రాహుల్ గాంధీని 30 గంటలకు పైగా ప్రశ్నించారు. అదే సమయంలో.. సోనియా గాంధీ, కోవిడ్ అనంతర సమస్యల చికిత్స తర్వాత ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఆమెకు కూడా ఈడీ సమన్లు పంపింది. అయితే ఆమె అనారోగ్యం కారణంగా జూన్ 23 వరకు సమయం ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీల పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇందులో కాంగ్రెస్ మౌత్ పీస్ అయిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను నడుపుతున్న AJL (అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్) ని యంగ్ ఇండియన్ స్వాధీనం చేసుకుంది. కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కేంద్రం తీరును విమర్శిస్తున్నారు. బీజేపీ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ఇతర రాజకీయ పార్టీల నేతలను కేసుల పేరుతో వేధిస్తోందని విమర్శించారు.
ఇదిలా ఉండగా సోనియా గాంధీ ఈ రోజు ఢిల్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia gandhi) ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కాగా, 75 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 2 న కరోనా పాజిటివ్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత.. వైరస్ (Covid) తగ్గుముఖం పట్టడంతో గత వారం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆమెకు పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి. దీంతో వారం క్రితం మరోసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.అక్కడ మరల వైద్యులు ట్రీట్ మెంట్ అందించారు. వారం తర్వాత.. సోమవారం సోనియాను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సోనియా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు(Congress party) పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.