హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Night Club Video: రాహుల్ గాంధీపై చైనీస్ వలపు వల: వైసీపీ విజయసాయిరెడ్డి బాంబు.. ఆ మహిళ ఎవరంటే..

Night Club Video: రాహుల్ గాంధీపై చైనీస్ వలపు వల: వైసీపీ విజయసాయిరెడ్డి బాంబు.. ఆ మహిళ ఎవరంటే..

రాహుల్ గాంధీ వీడియోపై విజయసాయి వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ వీడియోపై విజయసాయి వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో ఉదంతం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. ఇందులో అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని బీజేపీ ఆరోపిస్తుండగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీకి చెందిన విజయసాయరెడ్డి మాత్రం వలపు వల(హనీ ట్రాప్) జరగిందంటున్నారు..

ఇంకా చదవండి ...

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో వ్యవహారంలో ఇప్పుడు అంతర్జాతీయ కుట్రకోణంగానూ మారుతున్నది. జర్నలిస్ట్ అయిన ఓ మిత్రురాలి పెళ్లి వేడుక కోసం నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లిన రాహుల్ అక్కడ ‘లాడ్ ఆఫ్ ది డ్రింక్స్’అనే పబ్బులో కనిపించడం, సదరు వీడియోను బీజేపీ యంత్రాంగమంతా కలిసి వైరల్ చేయడం, అందులో తప్పేముందంటూ కాంగ్రెస్ కౌంటర్లు ఇవ్వడం తెలిసిందే. అయితే, నైట్ క్లబ్ వీడియోలో రాహుల్ గాంధీ పక్కన కనిపించిన మహిళ ఎవరనే విషయంలో పార్టీల మధ్య అనూహ్య రచ్చ చోటుచేసుకుంది.

రాహుల్ పక్కనే ఉండి మాట్లాడుతూ, డ్రింక్ తాగుతూ కనిపించిన మహిళ చైనా దేశపు రాయబారి అని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ విషయాన్ని మరింత పెద్దది చేస్తూ వైఎస్ జగన్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. రాహుల్ గాంధీపై హనీట్రాప్ (మహిళతో వలపువల విసరడం) జరుగుతోందని సాయిరెడ్డి బాంబు పేల్చారు. నిజంగా రాహుల్ తో కలిసున్న మహిళ చైనీస్ రాయబారేనా? అంటే..

నైట్ క్లబ్ వీడియోలోని దృశ్యాలు

CM KCR గూడుపుఠాని.. ప్రశాంత్ కిషోర్ సర్వే సంచలనం.. కేఏ పాల్ ప్రధాన ప్రత్యర్థి?: Revanth Reddy

అసలేం జరిగిందంటే: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసగా, బీజేపీ అనుకూల పార్టీలు సైతం కాంగ్రెస్ నేతలను దెప్పిపొడుస్తున్నాయి. జర్నలిస్ట్ అయిన మిత్రురాలు(సుమ్నిమా ఉదాస్‌) వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌గాంధీ ఐదు రోజుల పర్యటనపై నేపాల్‌ వచ్చినట్లు అక్కడి పత్రికలు రాశాయి. సుమ్నిమా ఉదాస్‌ కొన్నాళ్లు సీఎన్‌ఎన్‌ ఢిల్లీ విలేకరిగా పని చేశారు. నిర్భయ ఘటనపై ఆమె రిపోర్టింగ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. సుమ్నిమా తండ్రి మయన్మార్‌లో నేపాల్‌ రాయబారి కూడా. వివాహం ఏర్పాట్లలో భాగంగా రాహుల్‌గాంధీకి, ఇతర మిత్రులకు మారియట్‌ హోటల్లో బస ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి రాహుల్ ‘లార్డ్ ఆఫ్ డ్రిక్స్’ నైట్ క్లబ్ పబ్బులో కనిపించారు. రాహుల్‌ మరో ముగ్గురు వ్యక్తులు ఒక టేబుల్‌ చుట్టూ కూర్చోవడం, మిగతా వ్యక్తులు డ్రింక్స్‌ తాగుతుండగా రాహుల్‌ మాత్రం పక్కనున్న యువతితో మాట్లాడుతూ, ఫోన్‌ చూస్తున్నట్లు వీడియోలో కనిపించింది. రాహుల్‌ వ్యక్తిగత జీవితంతో తమకు పని లేదని, ఆయన చైనా ఏజెంట్లతో కూర్చున్నపుడు ప్రశ్నించక తప్పదంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ట్వీట్లు పెట్టారు.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి ఎప్పుడంటే..


రాహుల్ గాంధీపై వలపు వల: నేపాల్ నైట్ క్లబ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పక్కనే కనిపించిన మహిళ చైనీస్ రాయబారి అని బీజేపీ ప్రచారం చేస్తున్నక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియో.. చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతున్నాయన్న దానికి నిదర్శనం. ఈ వీడియో కలచివేసింది. తమ సొంత పార్టీ నాయకుడే ఇలా చేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ప్రధాని మోదీ యూరప్‌ పర్యటనను ఎలా ప్రశ్నిస్తారు?’’అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.

Smita Sabharwal: సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు భారీ షాక్.. అసలేం జరిగిందంటే..


సాయిరెడ్డికి కౌంటర్: అవినీతిపరుడైన విజయసాయిరెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటూ ఠాగూర్ చురకలు వేశారు. ‘‘అవినీతి విజయసాయిరెడ్డీ.. నిజం తెలుసుకుని మాట్లాడు. నీ సమస్య ఏమిటో మాకు తెలుసు. వైఎస్‌ జగన్‌పై అవినీతి కేసులున్నాయి. అందుకే సాహిబ్‌(మోదీ)ని సంతోషపెట్టడానికి ఇలా చేస్తున్నారు. కానీ వాస్తవాలను మరవద్దు. నేపాల్‌ రాయబారి కుమార్తె పెళ్లికి రాహుల్‌గాంధీ హాజరు కావడంలో తప్పేముంది?’’అని మణిక్కం ఠాగూర్‌ ట్వీట్‌ చేశారు. కాగా,

Rat: మంత్రి గారిని ఎలుక కరిచింది.. పాము కాటేసిందనుకొని పరుగోపరుగు.. దీనికి కారణం సీఎం నిర్ణయం?


ఆ మహిళ ఎవరంటే..: ఖాట్మండూ నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ పక్కనే కనిపంచిన మహిళ చైనీస్ రాయబారి అని ఆరోపణలు రావడంతో జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇందులో నిజమెంతో కనిపెట్టేందుకు ప్రయత్నించాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా బయటపడింది ఏంటంటే, ఆ మహిళ పెళ్లి కూతురు (సుమ్నిమా ఉదాస్‌) స్నేహితురాలైన నేపాలీ. చైనీస్ రాయబారి కాదట. నైట్ క్లబ్ యాజమాన్యం, సిబ్బంది, రాహుల్ తోపాటు ఆ సమయంలో పార్టీలో ఉన్న ఇతరుల నుంచి పలు మీడియా సంస్థలు వివరాలు సేకరించాయి. రాహుల్ గాంధీ మొత్తం గంటన్నరపాటు క్లబ్బులో ఉన్నారని, ఆ సమయంలో చైనాకు చెందిన గెస్టులు ఎవరూ లోపల లేరని, ప్రత్యేకించి, రాహుల్ గాంధీ వెంట ఉన్న మహిళ చైనీస్ రాయబారి కాదని కచ్చితంగా చెప్పగలమని నైట్ క్లబ్ యాజమాన్యం తెలిపినట్లుగా ‘ఇండియా టుడే’ ఫ్యాక్ట్ చెక్ రాసుకొచ్చింది.

రాహుల్ వెంట ఉన్నది ఎవరంటే

CM KCR పాలనకు కేంద్రం కితాబు.. టీబీజేపీలో గడ్కరీ కలకలం.. ప్రసంగ పాఠంలో గడబిడ వల్లేనట!


జగన్‌కు తెలిసే జరిగిందా?:  ఆ మహిళ ఎవరో ఎంటో అని నిర్ధారించుకోకుండా బీజేపీ ఆరోపణలు చేసిందంటే రాహుల్ గాంధీని ఇరుకున పెట్టే ఉద్దేశమని భావించొచ్చు. కానీ ఈ ఉదంతంలో బీజేపీ రాజకీయానికి వైసీపీ వంతపాడటం.. అది కూడా రాహుల్ గాంధీపై వలపు వల అంటూ జగన్ పార్టీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తాము కేసుల్లో ఇరుక్కొని, జైలు పాలు కావడానికి కారణంగా గాంధీ ఫ్యామిలీనే అని జగన్ బహిరంగానే తిట్టడం తెలిసిందే. అయితే ప్రస్తుత ఉదంతంలో వైఎస్ జగన్ కు తెలిసే సాయిరెడ్డి ఇంతటి సంచలన బాంబు పేల్చారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఎంపీ చెబుతున్నట్లు చైనీస్ హనీ ట్రాప్ (వలపు వల) ఉదంతాలు పెరిగాయనడానికి ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉందా? కనీసం ప్రభుత్వానికైనా ఆయన అంచనాలను చేరవేశారా? లేదా? అంతర్జాతీ కుట్రలను అడ్డుకోడానికి ఆంధ్రా ఎంపీగా సాయిరెడ్డి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Bjp, Congress, Nepal, Rahul Gandhi, Telangana, Vijayasai reddy, Viral Video, Ysrcp

ఉత్తమ కథలు