హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పాదయాత్రలో హల్ చల్ చేస్తున్న రాహుల్ గాంధీ.. వైరల్ గా మారిన స్నేక్ బోట్ రేస్ వీడియో...

పాదయాత్రలో హల్ చల్ చేస్తున్న రాహుల్ గాంధీ.. వైరల్ గా మారిన స్నేక్ బోట్ రేస్ వీడియో...

బోటింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ

బోటింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ

Kerala: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో సందడి చేశారు. పున్నమాడ సరస్సులో స్నేక్ బోట్ ఎగ్జిబిషన్ లో పాల్గొని అక్కడి వారిలో మరింత జోష్ ను నింపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

దేశంలో కాంగ్రెస్ ను (Congress) అధికారంలోకి తెవడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికోసం ఆయన భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇది కన్యకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగనుంది. దీనిలో రాహుల్ గాంధీ 3,570 కిలోమీటర్ల వరకు నడవనున్నారు. ఇప్పటికే ఆయన తన పాదయాత్రను తమిళనాడు నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన యాత్ర కేరళలో కొనిసాగుతుంది. ఈ క్రమంలో ఆయన పున్నమడ సరస్సులో ఆసక్తికరంగా స్నేక్ బోట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా (Viral video)  మారింది.

పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (bharat jodo yatra) కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడ స్థానికంగా పున్నమడ సరస్సులో స్నేక్ బోట్ రేస్ జరిగింది. దీనిలో స్థానికులతో కలిసి ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడున్న యువతను మరింత ఉత్సాహపరిచారు. దానిలో 3 బోట్ లు రేసులో పాల్గొనగా.. రాహుల్ ఉన్న బోటే గెలిచెంది.  ప్రస్తుతం ఈ వీడియోను ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిలో రెండు స్నేక్ బోట్ లు,పురుషులతో, రెండువైపులా రోయింగ్ చేస్తున్నట్లు కన్పిస్తుంది. దీనిలో రాహుల్ కూడా రెయిలింగ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సెప్టెంబరు 8న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పలువురు పార్టీ కార్యకర్తలతో కలిసి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.

రాహుల్ గాంధీ అగస్తీశ్వరం నుండి పాదయాత్రను ప్రారంభించగా, దేశవ్యాప్తంగా 118 మంది భారత్ యాత్రికులు, ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చారు.

మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ కన్యాకుమారి నుండి ఐదు నెలల్లో కాశ్మీర్ చేరుకోవాలని కాంగ్రెస్ నాయకుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిన్న రాహుల్ గాంధీ కేరళలోని హరిపాడ్ నుండి యాత్రను పునఃప్రారంభించి 11వ రోజు యాత్రను ప్రారంభించారు. రాహుల్  గాంధీ ఒక చిన్న అమ్మాయి పాదరక్షలు ధరించడంలో సహాయం చేస్తున్న వీడియోను మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bharat Jodo Yatra, Congress, Kerala, Rahul Gandhi, Viral Video

ఉత్తమ కథలు