హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bharat Jodo Yatra: శభాష్ రాహుల్ జీ.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు.. అసలేం జరిగిదంటే..

Bharat Jodo Yatra: శభాష్ రాహుల్ జీ.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు.. అసలేం జరిగిదంటే..

బాలికతో నడుస్తున్న రాహుల్ గాంధీ

బాలికతో నడుస్తున్న రాహుల్ గాంధీ

kerala: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ను (Congress) అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra)  చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన యాత్ర కేరళలో కొనసాగుతుంది. ఆయనకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతిచోట యువకులు,స్థానికులు ఆయనతో కలిసి నడుస్తున్నారు. రాహుల్ ప్రజలందరికి పలకరిస్తూ, ఎంతో ఉల్లాసంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పాదయాత్ర చేస్తుండగా ఆసక్తికర పరిణామం సంభవించింది. ఒక చిన్నారి పాదయాత్రలో తన తల్లితో కలిసి నడుస్తోంది.

అయితే.. ఆమె కాలి షూ లేస్ ముడి విడిపోయింది. బాలిక సరిగ్గానడవలేక ఇబ్బంది పడింది. దీన్ని రాహుల్ గాంధీ గమనించారు. వెంటనే ఆగి బాలికదగ్గరకు వెళ్లి ఆమె కాలి షూస్ లేస్ ను టైట్ గా కట్టారు. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఒకింత ఆశ్చర్యపోయారు. ఒక కాంగ్రెస్ కీలక నేత... ఇంత సింపుల్ గా ప్రజలతో మమేకమవడం పట్ల అక్కడున్న వారంతా సంతోషపడ్డారు.

ఈ ఘటనను అక్కడున్న వారంతా తమ ఫోన్ లలో రికార్డు చేశారు. అయితే.. ఈ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు డిసౌజా ట్విటర్ పోస్ట్ చేశారు. దీనికి సరళత, ప్రేమ ఇవి రెండు దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి అవసరమని క్యాప్షన్ జత చేశారు. రాహుల్ సామాన్యుడిలా ప్రజలతో కలుస్తున్న తీరు బాగుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పాదయాత్రలో రోజురోజుకు ప్రజల్లో తమ పట్ల స్పందన పెరుగుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా  (Viral) మారింది.

ఇదిలా ఉండగా రాజస్థాన్ లోని (Rajasthan)  జోధ్ పూర్ లో దారుణ ఘటన జరిగింది.

బోరుండాలోని డాక్టర్ రాధాకృష్ణన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఆకాష్ పట్ల అతని ఉపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించాడు. కొన్ని రోజులుగా హోమ్ వర్క్ సరిగ్గా చేయడం లేదని, ఉపాధ్యాయుడు రామ్ కరణ్, ఆకాష్ పై కోపంగా ఉన్నాడు. అంతే కాకుండా.. అందరి ముందే 15 సార్లు చెప్పుతో కొట్టాడు.

దీంతో అతని చెంపపై దద్దుర్లు వచ్చాయి. ఇంటికి రాగానే బాలుడు నీరంగా ఉండిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేశాక..మరింత మెరుగైన వైద్యం కోసం జోధ్ పూర్ వెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో చిన్నారి తండ్రి కనరామ్ , ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bharat Jodo Yatra, Congress, Kerala, Rahul Gandhi

ఉత్తమ కథలు