Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ రచ్చ... బ్యాటుతో కార్లపై దాడి... మిస్టర్ వాల్‌కి ఏమైంది?

రాహుల్ ద్రవిడ్ రచ్చ... బ్యాటుతో కార్లపై దాడి (image credit - twitter)

Rahul Dravid: ఒకవైపే చూడు... రెండోవైపు చూడకు... మాడిపోతావ్... అనే సినిమా డైలాగ్ లాగా... రాహుల్ ద్రవిడ్ రెండో వైపు చూపించాడు. రచ్చ రచ్చ చేశాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:
భారత క్రికెట్ జట్టులో ‘వాల్‌’గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్‌ ఎంతో సౌమ్యుడు. ఆటలో, మైదానం బయట కూడా జెంటిల్‌మేన్‌గా ద్రవిడ్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రికెటర్ కెరీర్‌లో చిన్నపాటి వివాదం కూడా లేదు. వివిధ దేశాల క్రికెటర్లు అతడికి ఎంతో విలువ ఇస్తారు. అలాంటి వ్యక్తికి ఇటీవల తీవ్రమైన కోపం వచ్చింది. అతడు రోడ్ల మీదికి వచ్చి ట్రాఫిక్‌లో అరుస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై ‘నేను ఇందిరా నగర్‌ రౌడీని’ అంటూ కోపాన్ని ప్రదర్శించాడు ద్రవిడ్. మృదు స్వభావిగా ఉండే ఈ క్రికెటర్ విశ్వరూపాన్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం మరొకటి ఉంది. ఇది నిజమైన వీడియో కాదు. ఒక ఎడ్వర్టైజ్‌మెంట్ కోసం ఈ వీడియోను చిత్రీకరించారు. ప్రకటనకు సంబంధించిన వీడియో విడుదలైన వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించే ఒక యాప్ కోసం రూపొందించిన ప్రకటనలో రాహుల్ ద్రవిడ్ నటించాడు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ద్రవిడ్, కోపంగా ఉన్నట్టు సరికొత్త అవతారంలో కనిపించాడు. బ్యాట్‌తో కార్లపై దాడి చేస్తూ, ఇతరులతో వాదిస్తూ, చిరాకు పడుతున్నట్టు వీడియోలో ఉంది. ఒక దశలో కోపంతో కారు సన్ రూఫ్ విండో నుంచి బయటకు వచ్చి.. ‘నేను ఇందిరా నగర్ రౌడీని’ అంటూ గట్టిగా అరిచాడు. బెంగళూరులోని ఇందిరానగర్‌లోనే అతడి ఇల్లు ఉంది. రాహుల్ ద్రవిడ్‌తో ఇలా వినూత్నంగా యాడ్ రూపొందించిన ఆ సంస్థకు మంచి గుర్తింపు లభిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.



ఈ వీడియోను చూసి భారత క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ కూడా ఆశ్చర్యపోయాడు. "రాహుల్ భాయ్‌లో ఇలాంటి యాంగిల్‌ను ఎప్పుడూ చూడలేదు" అనే ట్యాగ్‌తో కోహ్లీ యాడ్‌ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు.



ద్రవిడ్ వీడియోకు జొమాటో కూడా ఫన్నీగా స్పందించింది. ‘ఇందిరా నగర్‌లో ఒక రౌడీ రోడ్లపై ప్రజలను బయపెట్టిస్తున్నాడు. అందువల్ల ఆ ఏరియాలో ఫుడ్ డెలివరీ ఆలస్యం కావచ్చు’ అని జొమాటో ట్వీట్ చేసింది. అయితే కొంతమంది ఇదంతా నిజమే అనుకోవడంతో ఆ సంస్థ మళ్లీ మరో ట్వీట్ చేసింది. ‘ఇందిరా నగర్లో రౌడీలు ఎవరూ లేరు కానీ ఒక వాల్ మాత్రం ఉన్నాడు’ అనే ట్వీట్‌తో ద్రవిడ్‌ను గుర్తుచేసింది.



ఇది కూడా చదవండి: Fingers: మీ చేతి వేళ్లు ఎలా ఉంటాయి?... వేళ్లను బట్టీ మీరు ఎలాంటి వారో తెలుసుకోండి

రాహుల్ భాయ్‌ని ఇంతకు ముందు ఒకసారి కోపంగా చూశానని దేశవాళీలో కర్ణాటక తరఫున ఆడిన దొడ్డ గణేష్ ట్వీట్ చేశాడు. ఒకసారి డ్రెస్సింగ్ రూమ్‌లో తనపై కోప్పడ్డాడని చెప్పాడు. ఈ వీడియోకు నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు. కోపంలో కూడా ద్రవిడ్‌ బాగున్నాడని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. తమ అభిమాన క్రికెటర్‌ కోపాన్ని ప్రజలకు చూపించినందుకు ధన్యవాదాలని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
First published: