ఆవేశంతో తన నాన్నమ్మపై దాడి చేస్తున్న ఎద్దు నుంచి ఆమెను కాపాడుకున్నాడో బాలుడు. హర్యానా లోని మహేంద్రనగర్ కు చెందిన ఆ బాలుడి సాహసానికి నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి. అతడి ధైర్యాన్ని పలువురు మెచ్చకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మహేంద్రనగర్ కు చెందిన వృద్ధురాలు.. ఈనెల 28 న రాత్రి పూట నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఒక పొగరుబోతు ఎద్దు ఆమెపైకి దాడిచేసింది. దీంతో ఆమె ఎగిరి కొంతదూరంలో పడింది. ఇది గమనించిన ఆ బాలుడు.. ఆమెను రక్షించడానికి రాగా ఆ ఎద్దు అతడిని సైతం కొమ్ములతో పొడిచింది. దీంతో అతడు పక్కనే ఉన్న మోరిలో పడిపోయాడు. అయినా అక్కడ్నుంచి లేని తన నాన్నమ్మ దగ్గరికి వెళ్లాడు. వారిద్దరూ అక్కడ్నించి వెళ్లిపోతుండగా.. ఎద్దు మళ్లీ వారిని పొడిచింది. ఈసారి వారిరువురు చాలాదూరంలో పడ్డారు.
ఇదే సమయంలో స్థానికులు వచ్చి.. వారిరువురిని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ టీవీ ఫుటేజీలో రికార్డైంది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరలైంది. ఇది చూసిన నెటిజన్లు.. బాలుడిని మెచ్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి ఆ ముసలామెను కాపాడాడని అభినందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana