Radhika Apte: బాలీవుడ్‌కి, హాలీవుడ్‌కి తేడా ఏంటో చెప్పిన రాధికా ఆప్టే

Radhika Apte | బాలీవుడ్‌కి,హాలివుడ్‌కి తేడా ఏంటో చెప్పిన రాధిక ఆప్టే...బాలీవుడ్ నిర్మాతల తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: July 28, 2019, 8:32 AM IST
Radhika Apte: బాలీవుడ్‌కి, హాలీవుడ్‌కి తేడా ఏంటో చెప్పిన రాధికా ఆప్టే
రాధిక ఆప్టే
news18-telugu
Updated: July 28, 2019, 8:32 AM IST
ఇటు బాలీవుడ్..అటు హాలీవుడ్‌లో బిజీగా ఉన్న నటి రాధికా ఆప్టే. హాలీవుడ్ చిత్రం ‘లిబర్టీ: ఏ కాల్ టు స్పై’లో ఓ కీలక పాత్రను పోషించనుంది. ఇప్పటికే ‘ది వెడ్డింగ్ గెస్ట్’తో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. కాగా బాలీవుడ్‌‌కు, హాలీవుడ్‌కు తేడా ఏంటన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డబ్బుల కోసం ఆర్టిస్టులు అడుక్కోవాల్సిన అవసరం హాలీవుడ్‌లో ఉండదంటూ రాధికా ఆప్టే వ్యాఖ్యానించింది.

‘హాలీవుడ్‌లో పేమెంట్స్ అంతా పక్కాగా జరుగుతాయి..ఆర్టిస్టుల పేమెంట్స్ కరెక్ట్ సమయానికి వచ్చేస్తాయి. డబ్బుల కోసం ఆర్టిస్టులు అడుక్కోవాల్సిన అవసరం అక్కడ ఉండదు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది. తద్వారా తమ రెమ్యునరేషన్ ఇవ్వకుండా సతాయించే బాలీవుడ్ నిర్మాతల తీరును ఆమె ఎండగట్టింది.

‘లిబర్టీ: ఏ కాల్ టు స్పై’ చిత్రంలో ఓ గూడాఛారి పాత్రని పోషిస్తోంది రాధికా ఆప్టే.వరల్డ్ వార్-2లో ఫ్రాన్స్‌కు సాయపడే గూడాఛారి పాత్ర అది. ఈ చిత్రంలో తన పాత్రను లోతుగా అర్థంచేసుకునేందుకు పలు పుస్తకాలను చదువుతోంది.

First published: July 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...