హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Racist Attack Video : జాత్యహంకార దాడి..అసభ్య పదజాలంతో దూషిస్తూ భారతీయులపై చేయి చేసుకున్న అమెరికన్

Racist Attack Video : జాత్యహంకార దాడి..అసభ్య పదజాలంతో దూషిస్తూ భారతీయులపై చేయి చేసుకున్న అమెరికన్

భారతీయులపై దాడికి పాల్పడ్డ మహిళ

భారతీయులపై దాడికి పాల్పడ్డ మహిళ

Racist Attack On Indians : కొంతకాలంగా అమెరికాలో జాత్యహంకార దాడులు(Racist Attack)ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. కొంతమంది జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ భారతీయులను(Indians) మానసికంగా వేధిస్తున్న ఘటనలతోపాటు మా దేశం నుంచి వెళ్ళిపొండి అంటూ దాడులకు తెగబడుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Racist Attack On Indians : కొంతకాలంగా అమెరికాలో జాత్యహంకార దాడులు(Racist Attack)ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. కొంతమంది జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ భారతీయులను(Indians) మానసికంగా వేధిస్తున్న ఘటనలతోపాటు మా దేశం నుంచి వెళ్ళిపొండి అంటూ దాడులకు తెగబడుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరగగా..దీనికి సంబంధించిన వీడియో వైరల్(Viral Video) గా మారింది. ఈ వీడియో ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వ్యక్తి అక్కడ జరిగిన సంఘటన గురించి వివరించారు. మా అమ్మ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి భోజనానికి వెళుతున్న సమయం లో మెక్సికన్ అమెరికన్ అయిన ఒక మహిళ అక్కడికి వచ్చి వారితో వాదనకూ దిగింది. జాత్యహంకార దూషణలు చేయొద్దని కోరినా కూడా ఆమె దారుణమైన పదజాలం తో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసింది అంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.


వైరల్ అవుతున్న వీడియోలో..అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని డల్లాస్‌ లో బుధవారం రాత్రి ఓ పార్కింక్ లాట్‌ లో నలుగురు భారతీయ అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా అక్కడికి ఓ మహిళ వచ్చింది. మీ దేశానికి తిరిగి వెళ్ళిపొండి అంటూ భారతీయ మహిళలను దుర్భాషలాడటం మొదలు పెట్టింది. తనను తాను మెక్సికన్ అమెరికన్ గా చెప్పుకొన్న ఆ మహిళ అక్కడ ఉన్న భారతీయులనుద్దేశించి మాట్లాడుతూ..తాను భారతీయులని ద్వేషిస్తున్నా అంటూ అసభ్య పదజాలాన్ని వాడింది. బెట‌ర్ లైఫ్ కోస‌మే భార‌తీయులు అమెరికా వ‌స్తుంటార‌ని, మీరు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు,మీ మీ దేశానికి వెళ్లిపోండి అంటూ జాత్యంహకార వ్యాఖ్యలు చేసింది.
Serial Conman: ఈడోరకం... పోలీసులకు దొరికిపోవడానికి జనాలను మోసం చేస్తాడు


తాను అమెరికాలోనే పుట్టానని, ఇది తన దేశమని, తాను ఎక్క‌డ‌కు వెళ్లినా అక్క‌డ ఇండియ‌న్లు క‌నిపిస్తుంటార‌ని, ఒక‌వేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్క‌డకి ఎందుకు వ‌చ్చిన‌ట్లు ఆమె అరించింది. ఇదే సమయంలో భార‌తీయ మహిళలపై కూడా ఆమె చేయి చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. భార‌తీయుల‌పై చేయి చేసుకున్న ఆ మ‌హిళ‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మెక్సిక‌న్ అమెరికన్ మ‌హిళ‌ను ఎస్మ‌రాల్డో ఉప్ట‌న్‌గా గుర్తించారు. దాడికి సంబంధించిన వీడియో అమెరికాలోని ఇండియ‌న్ క‌మ్యూనిటీలో వైర‌ల్ అయ్యింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: USA, Viral Video