హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: వారెవ్వా.. జంతువులు, పక్షుల గొంతుతో సారే జహాసే అచ్చా గీతాలాపన.. వీడియో వైరల్

Viral: వారెవ్వా.. జంతువులు, పక్షుల గొంతుతో సారే జహాసే అచ్చా గీతాలాపన.. వీడియో వైరల్

Image Credits To Twitter

Image Credits To Twitter

Sounds OF The Indian Wild Life: వాయిద్యాలేమీ వాడకుండా సంగీతాన్ని అందించడంలో ఈ బృందం ఖ్యాతి గాంచింది. ఇక ఈ పాటను నెమళ్లు, ఏనుగులు, కోతులు, సింహాలు, చింపాంజిలు చేసే శబ్దాలతో రూపొందించడం గమనార్హం.

 • News18
 • Last Updated :

  మంగళవారం దేశవ్యాప్తంగా ప్రజలు 72 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇక కోవిడ్ కాలంలో ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించిన కార్యక్రమాలు, సైనికుల విన్యాసాలు, శకటాల ప్రదర్శన ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నది. ఇదే క్రమంలో భారత్ కు చెందిన A-capella బృందం, రాగా ట్రిప్పిన్ మాత్రం గణతంత్ర దినోత్సవాన్ని కాస్త డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసింది. భారత్ లో ఉన్న జంతువులు, పక్షులు చేసే శబ్దాలతో ‘సారే జహాసే అచ్చా’ ను రూపొందించింది. వాయిద్యాలేమీ వాడకుండా సంగీతాన్ని అందించడంలో ఈ బృందం ఖ్యాతి గాంచింది. ఇక ఈ పాటను నెమళ్లు, ఏనుగులు, కోతులు, సింహాలు, చింపాంజిలు చేసే శబ్దాలతో రూపొందించడం గమనార్హం.

  A-capella బృందం చేసిన ఈ వీడియో సాంగ్ వైరల్ గా మారింది. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాటలో వినిపించే నెమళ్లు, సింహం, ఏనుగు, కోతుల శబ్దం వాటి ఒరిజినల్ వాయిస్ కాదు. ఈ బృందంలోని సభ్యులే.. వాటిని అనుకరిస్తూ పాడారు. అలన్ డిసౌజా, గేరీ మిస్కిట్టా, గ్వేన్ డయాస్, కేశియా బ్రంజ, సుజన్నే డెమొల్లో, థామ్సన్ ఆండ్రూస్ లతో కూడిన A-capella బృందం ఈ గీతాన్ని రూపొందించింది.  1.42 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగానే వైరల్ అయింది. వీడియోలో భారత్ లో 90 వేల జంతువుల జాతులు, 45 వేల మొక్కల జాతులకు నిలయమని.. ఈ వైవిధ్యాన్ని ప్రత్యేక రీతిలో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. animal planet చానెల్ వాళ్లు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ట్వీట్ చేశారు.


  ‘భారతదేశం నలుమూలల నుంచి విభిన్న వన్యప్రాణులను దేశభక్తి కోణంలో జరుపుకుంటూ మా బృందం ఐదు స్వరాలను ఉపయోగించి ఈ జింగిల్ ను సృష్టించామ’ని A-capella బృందం సభ్యులు తెలిపారు. అయితే ఈ పాటకు మిశ్రమ స్పందన వస్తున్నది. పలువురు ఈ వీడియోను లైక్ చేస్తుండగా.. మరికొందరేమో ఈ గీతాన్ని అవమానపరిచారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Tiger, Trending, Trending videos, Twitter, Viral, Viral Videos

  ఉత్తమ కథలు