హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

సమాధిపై QR కోడ్.. ఆ యువకుడి జ్ఞాపకాలు డిజిటల్ రూపంలో పదిలం

సమాధిపై QR కోడ్.. ఆ యువకుడి జ్ఞాపకాలు డిజిటల్ రూపంలో పదిలం

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - @QRMemories)

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - @QRMemories)

అతనో టెక్ సవ్వీ. రకరకాల టాలెంట్స్ అతని సొంతం. కానీ సడెన్‌గా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. అతను లేని లోటును మర్చిపోలేకపోతున్న కుటుంబ సభ్యులు.. అదే టెక్నాలజీతో అతని జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం సమాధిపై QR కోడ్ సెట్ చెయ్యడం.. చర్చనీయాంశం అయ్యింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అతని పేరు ఎవిన్ ఫ్రాన్సిస్ (Evin Francis). కేరళలోని త్రిచూర్ నివాసి. చదువులోనే కాదు.. ఫొటోగ్రఫీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, డీకోడింగ్ ఇలా అతనికి చాలా టాలెంట్స్ ఉన్నాయి. అంతేకాదు.. డ్రమ్స్, గిటార్, కీబోర్ట్ ప్లే చెయ్యగలదు. మల్టీ టాలెంటెడ్ కావడంతో... అతను ఎక్కడున్నా ఏదో తెలియని ఆనందం చుట్టుపక్కల వారికి కలిగేది. అలాంటి ఎవిన్.. 26 ఏళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని వీడి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని కుటుంబ సభ్యులకు కన్నీటి జ్ఞాపకాల్ని మిగిల్చి మాయమయ్యాడు. దాంతో.. ఆ ఫ్యామిలీ.. కన్నీటి సంద్రంలో శిలైపోయింది.

త్రిచూర్‌లోని వట్టాకుజీకి చెందిన ఫ్రాన్సిస్ కొడుకు ఎవిన్. కొడుకు దూరమవ్వడంతో.. తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులూ, బంధువులకు ఓ ఐడియా వచ్చింది. ఎవిన్ జ్ఞాపకాలను డిజిటల్ రూపంలో చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఎవిన్ సమాధిపై ఓ QR కోడ్‌ను సెట్ చేశారు.

ఇప్పుడు ఎవరైనా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. వెంటనే మొబైల్‌లో ఎవిన్ కనిపిస్తాడు. అతని పాటలు, వీడియోస్ సందడి చేస్తాయి. ఎవిన్ సోదరి అయిన ఎవ్లిన్.. ఒమన్‌లో ఆర్కిటెక్ట్. ఆమే ఈ ఏర్పాటు చేసింది.

QR కోడ్ స్కాన్ చేశాక కనిపించే వీడియోలు, ఫొటోల కోసం.. ఎవ్లిన్.. ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేసింది. అందులో ఎవిన్ జీవితంలోని కీలక అంశాలు, అతని టాలెంట్‌కి సంబంధించిన వీడియోలను ఉంచింది.

ఎవిన్.. మెడికల్ డిగ్రీ సంపాదించాక.. ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2021 డిసెంబర్ 22న షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతూ సడెన్‌గా కుప్పకూలాడు. ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడే.. ఆ కుటుంబానికి అతని జ్ఞాపకాల్ని డిజిటల్ రూపంలో చూపిస్తోంది.

First published:

Tags: Kerala

ఉత్తమ కథలు