బాత్రూమ్ హర్రర్.. యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన కొండచిలువ

టాయిలెట్ సీటుపై కూర్చుని తన పాని తాను కానిస్తుండగా.. ఒక్కసారిగా పురుషాంగంలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఏంటని చూస్తే.. కొండచిలువ కనిపించింది.

news18-telugu
Updated: September 11, 2020, 7:05 AM IST
బాత్రూమ్ హర్రర్.. యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన కొండచిలువ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడికి బాత్రూమ్‌లో భయానక అనుభవం ఎదరయింది. కాలకృత్యాల కోసం వెళ్లిన యువకుడిని పైతాన్ కాటువేసింది. టాయిలెట్ సీటుపై కూర్చొని ఫోన్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో కొండచిలువ దాడిచేసింది. ఈఘటనలో అతడి పురుషాంగానికి గాయమై రక్తస్రావమైంది. సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని నాంతబురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డైలీ మెయిల్ కథనం ప్రకారం.. షిరఫాప్ మసుకురట్ అనే 18 ఏళ్ల యువకుడు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ కాలంక్షేపం చేస్తాడు. మంగళవారం కూడా వీడియోలు చూస్తున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లాడు. అక్కడకు కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్లి వీడియోలు చూస్తున్నాడు. టాయిలెట్ సీటుపై కూర్చుని తన పాని తాను కానిస్తుండగా.. ఒక్కసారిగా పురుషాంగంలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఏంటని చూస్తే.. కొండచిలువ కనిపించింది.

అంతేకాదు భారీగా రక్తస్రావవమైంది. ఆ కొండ చిలువ కాటువేసిందని గ్రహించిన మసుకురట్.. కేకలు వేస్తూ అక్కడి నుంచి ఇంట్లోకి పరుగులుపెట్టాడు మసుకురట్. అతడి పరిస్థితి తల్లి చూసి భయపడిపోయింది. హుటాహుటిన సమీపంలో ఉన్న బ్యాంగ్ యే ఆస్పత్రికి తరలించారు. గాయాన్ని యాంటీ బయాటిక్ వాష్‌తో క్లీన్ చేసిన డాక్టర్లు.. ఆ తర్వాత మూడు కుట్లు వేశారు. అనంతరం మందులు ఇచ్చారు. మళ్లీ బాత్రూమ్‌లోకి వెళ్లి చూస్తే కొండ చిలువ అక్కడే ఉంది. టాయిలెట్‌ సీటులో చుట్టుకొని ఉండి కనిపించింది. పాములను పట్టేవారికి సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి దాన్ని పట్టుకెళ్లిపోయారు. ఐతే కొండ చిలువ చిన్నగానే ఉందని..కాని అది చేసిన గాయం మాత్రం చాలా పెద్దదని చెప్పాడు మసుకురట్.

బాత్రూమ్‌లో ఉన్న ఆ కొండ చిలువ పొడవు 4 ఫీట్లు ఉంటుందని మసుకురట్ తల్లి తెలిపింది. అసలు అది ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదని వెల్లడించింది. బహుశా.. డ్రైన్ పైప్ ద్వారా టాయిలెట్‌లోకి వచ్చి ఉంటుందని అభిప్రాయపడింది. ఆ ఘటన తర్వాత తన కుమారుడు బాత్రూమ్‌లోకి వెళ్లేందుకే భయపడిపోయాడని.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే మారుతున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఆ కొండచిలువ అది విషసర్పం కాదని.. అందుకే ప్రాణాపాయం నుంచి మసుకురట్ బయటపడ్డాడని తెలిపింది అతని తల్లి.
Published by: Shiva Kumar Addula
First published: September 11, 2020, 7:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading