హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

P. V Sindhu: చిందులేసిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. వైరల్ అవుతోన్న వీడియో.. ఎందుకో తెలుసా..

P. V Sindhu: చిందులేసిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. వైరల్ అవుతోన్న వీడియో.. ఎందుకో తెలుసా..

డ్యాన్స్ వేస్తున్న పీవీ సింధు

డ్యాన్స్ వేస్తున్న పీవీ సింధు

P. V Sindhu: పీవీ సింధు.. క్రీడలపై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ సుపరిచితమైన పేరు. దాదాపు పాఠశాలలో చదువుతున్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన వ్యక్తి. ఎందుకుంటే.. భారతదేశానికి రెండు సార్లు ఒలంపిక్ లో వ్యక్తిగత పతకాలను తీసుకొచ్చారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

  పీవీ సింధు.. క్రీడలపై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ సుపరిచితమైన పేరు. దాదాపు పాఠశాలలో చదువుతున్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన వ్యక్తి. ఎందుకుంటే.. భారతదేశానికి రెండు సార్లు ఒలంపిక్ లో వ్యక్తిగత పతకాలను తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన పీవీ సింధు.. 2021 లో టోక్యోలో కూడా బ్రాంజ్ మెడ‌ల్‌ సాధించి..రెండు పతకాలతో తన సత్తా ఏంటో నిరూపించింది. దీంతోనే ఆమెకు సోమవారం అనౌన్స్ చేసిన పద్మ అవార్డుల్లో.. పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.

  Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కీలక సూచన చేసిన అధికారులు..


  ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పూసర్ల వెంకట సింధు పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు. ఇది 2020 సంవ‌త్సరానికి గాను పీవీ సింధుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ఆమె ఆ అవార్డును స్వీక‌రించారు సింధు. అయితే పీవీ సింధుకు 2015లో ప‌ద్మ‌శ్రీ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయతే మొత్తం ఈ ఏడాది 119 ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దాంట్లో ఏడు ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ది ప‌ద్మ‌భూష‌ణ్‌, 102 ప‌ద్మ‌శ్రీ అవార్డులు ఉన్నాయి.

  Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి


  Sindhu Pv (@pvsindhu1) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది  Degree Students: వాళ్లు ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థినులు.. మరి ఇలా ఎందుకు మారారో..


  అవార్డులు అందుకున్న‌వారిలో 29 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో 16 మందికి మ‌ర‌ణానంత‌రం అవార్డుల‌ను ఇచ్చారు. ప‌ద్మ అవార్డులు స్వీక‌రించిన వారిలో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. పీవీ సింధు డ్యాన్స్ వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఆ వీడియో పీవీ సింధుయే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. పద్మ అవార్డును అందుకోవడానికి ముందు ఈ వీడియోను పోస్టు చేశారు.

  OMG: కూర నచ్చలేదని అతడు తన భార్యను ఏం చేశాడో చూడండి.. ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..


  ట్రెడిషనల్ వేర్ ధరించి సింపుల్‌గా చిందులేసింది. దివాళి సందర్భంగా జరుపుకున్న వేడుకలో ఈ వీడియో తీయగా.. తాజాగా ఆమె తన ఇనస్టాగ్రామ్‌లో పేజీలో షేర్ చేసింది. ఇలా పోస్టు చేసిన ఆ వీడియోకు కొన్ని గంటల్లోని లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కాంజీవరం సీ గ్రీన్ కలర్ లెహంగాలో సింధు ఎంతో అందంగా కనిపించింది. ఇక వెస్ట్రన్ మ్యూజిక్‌కు సింపుల్‌గా స్టెప్పులేస్తూ.. అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది.

  Published by:Veera Babu
  First published:

  Tags: Dance Plus, Pv sindhu, VIRAL NEWS, Viral Video

  ఉత్తమ కథలు