నేడు పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం... మాజీ ప్రధానికి ఏడాదిపాటూ ఘనంగా కార్యక్రమాలు

పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా... తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: June 28, 2020, 6:06 AM IST
నేడు పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం... మాజీ ప్రధానికి ఏడాదిపాటూ ఘనంగా కార్యక్రమాలు
నేడు పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం... మాజీ ప్రధానికి ఏడాదిపాటూ ఘనంగా కార్యక్రమాలు (credit - twitter)
  • Share this:
భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆజ్యంపోసి... అప్పుల్లో ఉన్న భారత్‌ని ఆర్థిక శక్తిగా మలిచిన ఘనత మాజీ ప్రధాని వీపీ నరసింహారావు సొంతం. ఆయన పాజిటివ్ ఆలోచనా ధోరణి, భవిష్యత్ దృక్పథం, సాహసోపేతమైన నిర్ణయాలు దేశాన్ని ముందుకు నడిపించి... తిరుగులేని శక్తిగా మలిచాయి. ఆయన సేవల్ని గుర్తిస్తూ... భారత రత్న ఇవ్వాలని కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం... వీపీ శత జయంతి ఉత్సవాలకు నేడు శ్రీకారం చుడుతోంది. ఏకంగా ఏడాదిపాటూ ఈ ఉత్సవాల్ని నిర్వహించనుండటం విశేషం. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. రాజ్యసభ ఎంపీ కే కేశవరావు అధ్యక్షతన ఈ నిర్వహణ కమిటీ ఏర్పాటైంది. 2020 జూన్ 28న ప్రారంభమయ్యే శత జయంతి ఉత్సవాలు... 2021 జూన్ 28 వరకూ కొనసాగనున్నాయి.


పీవీ శత జయంత్యుత్సవాల కమిటీ... ముందుగా... ఉత్సవాల లోగోను ఆవిష్కరించింది. అలాగే... హైదరాబాద్... నెక్లెస్ రోడ్డులోని వీపీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్ని నేడు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. మొత్తం 50 దేశాల్లో ఏడాది పాటూ వేర్వేరు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా... హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లలో పీవీ కాంస్య విగ్రహాల్ని ఏర్పాటు చేస్తారు.


అలాగే... పీవీ ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ కూడా సెట్ చేస్తారు. అంతేకాదు.... తెలంగాణ అసెంబ్లీలో వీపీ ఫొటో పెడతారు. వీపీ చేసిన సేవల్ని గుర్తుచేస్తూ...ఓ సావనీర్ కూడా రెడీ చేస్తారు. అలాగే... ప్రముఖులు చెప్పే విషయాలతో ప్రత్యేక మేగజన్ కూడా రిలీజ్ చేయనున్నారు.


పీవీ నరసింహారావు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే దేశం ఇప్పుడు ఈ స్థితిలో ఉందంటున్న తెలంగాణ ప్రభుత్వం... ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని అంటోంది. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి... పీవీకి తగిన గుర్తింపు వచ్చేలా చేస్తామని తెలిపింది. ఈ శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేక కార్యక్రమం ఉండనుందని తెలిసింది. అలాగే... విద్య, సాహిత్య, రాజకీయ రంగాల్లో కృషి చేసిన వారికి... ప్రత్యేక పీవీ స్మారక అవార్డులు కూడా ఇవ్వనున్నారు. విద్యార్థులతో కూ‌డిన ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరపనున్నా్రు.
First published: June 28, 2020, 6:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading