మనలో చాలా మంది రెక్కలు ముక్కలు చేసుకొని... రోజంతా కష్టపడినా... రోజుకు రూ.500 కూడా రావు. వేరే ఏ ఉద్యోగమూ దొరక్క... చాలా మంది అలాగే శ్రమిస్తూ... రాజీ పడుతూ జీవిస్తుంటారు. మనలోనే కొందరు మాత్రం ఆశ్చర్యపోయే ఉద్యోగాలు చేస్తుంటారు. అమెరికా లాంటి దేశంలో... తమ కాళ్ల పాదాల ఫొటోలు అమ్ముకుంటూ... లక్షలు సంపాదించేవాళ్లు ఉన్నారు. అదో రకం జాబ్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఓ చిత్రమైన ఉద్యోగం. ఇందులో పని చాలా సింపుల్. రోజుకో కొత్త జత చెప్పులు వేసుకోవాలి. అవి ఎలా ఉన్నాయో రివ్యూ చెప్పాలి. రివ్యూ అనగానే కష్టం అనుకోకండి. చెప్పులు బాగున్నాయా, లేదా అన్నది చెప్పాలి అంతే. మరి ఇంత సింపుల్ జాబ్‌కే నెలకు రూ.4 లక్షలు ఎందుకు ఇస్తామంటున్నారు అనే డౌట్ మనకు రావచ్చు. అదీ తేల్చేద్దాం.
బెడ్రూమ్ అథ్లెటిక్స్ (Bedroom Athletics). ఇదో షూ కంపెనీ జాబ్. ఈ జాబ్ చేయాలనుకునేవారు కంపెనీ ఇచ్చే షూస్ లేదా చెప్పులను రోజుకు 12 గంటలపాటూ కంటిన్యూగా వేసుకోవాలి. ఇలా రోజుకో జత ఇస్తారు. ఈ కంపెనీ... రకరకాల కొత్త మోడల్స్ చెప్పులను రోజూ తయారు చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఈ ఉద్యోగం చేసేవారు తమ కాళ్లకు సరిపడే సైజు షూస్ లేదా చెప్పులు రోజూ వేసుకోవాలి. అవి వేసుకొని... కంపెనీ అంతా తిరగొచ్చు. నిల్చోవచ్చు, కూర్చోవచ్చు, పరిగెత్తొచ్చు, పడుకోవచ్చు... ఏమైనా చెయ్యొచ్చు. కానీ... చెప్పులు మాత్రం 12 గంటల వరకూ తియ్యకూడదు. ఈ లోపు అవి కరిచినా, ఇరుకుగా అనిపించినా... వాడి తీరాల్సిందే.
12 గంటల తర్వాత ఆ రోజు ఏ చెప్పులు వాడిందీ, వాటి సైజు, కలర్ వివరాలు ఓ చోట రాసి... అవి కంఫర్ట్‌గా ఉన్నాయో లేదో చెప్పాలి. ఒకవేళ నచ్చకపోతే... ఎలా ఉంటే బాగుంటుందో కూడా సజెషన్ ఇవ్వాలి. ఈ జాబ్ చేయడానికి విద్యార్థులు, పార్ట్ టైమ్ వర్కర్లు, ఇళ్లలో ఉండే వారు అర్హులు. సమస్యేంటంటే ఈ ఉద్యోగం ఇండియాలోది కాదు. బ్రిటన్లోది. ఇది చెయ్యాలనుకునేవారు బ్రిటన్ వెళ్లాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: పచ్చ, కెంపు, రూబీ, రత్నం, వజ్రం... ఏ నెలలో పుట్టిన వారు ఏ రాయి తొడగాలి... తెలుసుకుందాం.
ఈ ఉద్యోగానికి ఎంత మంది అప్లై చేసుకుంటారో చూడాలని ఉందని కంపెనీ ఓనర్ హోవార్డ్ వెయిటర్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో... బ్రిటన్ ప్రజలకు ఇది సరైన జాబ్ అన్నారు ఆయన. ప్రస్తుతం ఈ కంపెనీ జాబ్ ఆఫర్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంత మంది అప్లై చేసుకున్నా... ఉద్యోగం పొందేది ఇద్దరు మాత్రమే అని కంపెనీ తన యాడ్‌లో తెలిపింది.
Published by:Krishna Kumar N
First published:January 17, 2021, 13:47 IST