Home /News /trending /

PUSHPA SONG THERE IS ALSO THE DOMINANCE OF MONOLITHS SAMANTHA MANIA AND ALLU ARJUN SONG IN BTS EVK

Pushpa Song: అక్క‌డ కూడా మ‌నోళ్ల డామినేష‌నే.. బీటీఎస్‌లో స‌మంత‌ మానియా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pushpa Song | బన్ని, సుకుమార్, దేవి శ్రీ కంబోలోని పుష్ప (Pushpa) సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ అందించింన సాంగ్ చాలా బాగా క్లిక్ అయ్యాయి. సినిమా హిట్‌తో పాటు సాంగ్స్ మంచి పాపుల‌ర్ అయ్యాయి. ఈ సాంగ్ ఇప్పుడు బీటీఎస్‌లోకి చేరింది.

ఇంకా చదవండి ...
    బన్ని, సుకుమార్, దేవి శ్రీ కంబోలోని పుష్ప (Pushpa) సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ అందించింన సాంగ్ చాలా బాగా క్లిక్ అయ్యాయి. సినిమా హిట్‌తో పాటు సాంగ్స్ మంచి పాపుల‌ర్ అయ్యాయి. ఈ సినిమాలో స‌మంత స్పెష‌ల్ సాంగ్ (Samantha Special Song) మూవీకే హైలెట్‌. ఈ సినిమాలో ఈ పాట ఎంత హిట్ అనేది చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ పాట క్రేజ్ బ‌య‌టి దేశాల్లోనూ క‌నిపిస్తోంది. టాంజానియా , దక్షిణ కొరియా (South Korea)  వంటి దేశాలకు చేరుకుంది. అక్కడవారు ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

    OTT Platforms: యూట్యూబ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వ‌ర‌కు ఆన్‌లైన్ ప్లాట్ ఫాం ధ‌ర‌ల వివ‌రాలు







    తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఫేమస్ డ్యాన్స్ గ్రూప్ బీటీఎస్ (BTS) కూడా ఊ అంటావా మావా…ఊఊ అంటావా మావా అంటూ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. బీటీఎస్ మ‌ధ్య‌లో ఉంటే టీ అంటే టాలీవుడ్ అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టిందంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ పాట ఎంత పాపుల‌ర్ అయ్యిందో.

    Amit Shah: ప్ర‌తిప‌క్షాల గుండెల్లో బాంబ్ పేల్చిన అమిత్‌షా.. అక్క‌డ ఎలెక్ష‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు

    ప్ర‌త్యేక అభిమానులు..
    కొరియన్ బీటీఎస్ డ్యాన్స్ గ్రూప్‌కు ఇండియా (India) లో స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ కూడా.. కరోనా కార‌ణంగా ఈ బీటీఎస్ డ్యాన్స్ కాస్త విరామం తీసుకొంది. అయితే తిరిగి తెలుగు పాట‌తో మ‌ళ్లీ ఫ్యాన్స్ ముందుకు వ‌చ్చింది. అదే పుష్ప సినిమాలోని ఊ.. అంటావా సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ బీటీఎస్ అభిమానుల‌ను ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకొంటుంది.

    అంతే కాకుండా గతంలో ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా’, ‘నీయవ్వ తగ్గేదేలే...’ లను అనుకరించిన వార్నర్.. తాజాగా శ్రీవల్లి పాటకు కాలు కదిపాడు. ఆ పాటకు బన్నీ వేసిన స్టెప్పులనే అచ్చు గుద్దినట్టు దించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది




    గ‌తంలో అల‌వైకుంఠ‌ పురం కూడా..
    2020లో అల్లు అర్జున్ సినిమా అల‌వైకుంఠ‌ పురం సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతమందిని అలరించిందో తెలిసిందే.. ఇప్పుడు ఈ క్రెడిట్ మళ్ళీ బన్ని మువీలోని సమంత ఊ అంటావా మావా సాంగ్ దక్కించుకుంది. ఊ అంటావా మావా అంటూ ఈ చెన్నై సోయగం చేసిన డ్యాన్స్ అనేక దేశాల వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అవును ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ స‌మంత చేసిన డ్యాన్స్‌కు కుర్ర‌కారు ఫిదా. ఈ పాట యూట్యూబ్‌లో కొన్ని వారాల్లోనే 100 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Allu Arjun, Samantha Ruth Prabhu, Telugu movies, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు