Home /News /trending /

PUSHPA FEVER IN BOARD EXAMS WEST BENGAL STUDENT WROTE IN 10TH EXAM ANSWER SHEET MAI LIKHEGA NAHI SK

Pushpa: ఇదెక్కడి మాస్ రా మావా.. 'రాసేదే లేదు'.. టెన్త్ ఎగ్జామ్ పేపర్‌లో పుష్ప డైలాగ్స్

ఎగ్జామ్ పేపర్‌లో పుష్ప డైలాగ్స్

ఎగ్జామ్ పేపర్‌లో పుష్ప డైలాగ్స్

Pushpa Movie: పశ్చిమ బెంగాల్‌లో ఓ జాతిరత్నం ఉన్నాడు. ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్‌కు బదులు పుష్ప డైలాగ్‌లు రాశాడు. టెన్త్ పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా.. ''పుష్ప..పుష్పరాజ్.. అపున్ లిఖేగా నహీ (రాసేదే లేదు)''.. అని రాశాడు.

    గత ఏడాది విడుదలైన 'పుష్ప' మూవీ ఏ స్థాయిలో రికార్డుల మోత మోగించిందో అందరికీ తెలిసింది. తెలుగులోనే కాదు..విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఊచకోత కోసింది. కలెక్షన్‌ల సునామీ సృష్టించింది. డైరెక్ట్ హిందీ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను సాధించి దక్షిణాది సత్తాను చాటింది. అంతేకాదు అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఇక ఈ సినిమాల్లోని డైలాగ్‌లు, పాటను యావత్ ప్రపంచాన్ని ఊపేశాయి. సోషల్ మీడియా మొత్త షేక అయింది. మోజ్, జోష్, టకాటక్, రీల్స్, షార్ట్స్.. ఇలా ఏ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ చూసినా.. పుష్ప  జోషే కనిపించింది. విదేశీయులు సైతం పుష్ఫ డైలాగ్‌లు చెప్పారు. శ్రీవల్లి స్పెప్పులేశారు. అంతెందుకు.. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా పుష్ప మార్క్ సెలబ్రేషన్స్ వైరల్ అయ్యాయి. అంతలా సంచలనాలు సృష్టించింది పుష్ప.

    వరుణ్ గని, బీస్ట్, కేజీఎఫ్, ఆచార్య సహా ఏప్రిల్ లో విడుదల కానున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్..

    సినిమా వచ్చి దాదాపు 5 నెలలు అవుతున్నా పుష్ప ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం పుష్ప ఫీవర్ ఎగ్జామ్స్‌కు పాకింది. సాధారణంగా పరీక్షల సమయంలో కొందరు విద్యార్థలు చిత్ర విచిత్ర సమాధానాలు రాస్తుంటారు. ఆన్సర్ తెలియక.. తోచింది రాసేస్తుంటారు. కొందరు పద్యాలు రాస్తే.. ఇంకొందరు కథలు అల్లుతారు. మరికొందరేమో ఇచ్చిన ప్రశ్నలను పదే పదే రాసి.. ఆన్సర్ షీట్ నింపేస్తారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఓ జాతిరత్నం ఉన్నాడు. ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్‌కు బదులు పుష్ప డైలాగ్‌లు రాశాడు. టెన్త్ పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా.. ''పుష్ప..పుష్పరాజ్.. అపున్ లిఖేగా నహీ (రాసేదే లేదు)''.. అని రాశాడు. ప్రస్తుతం ఆ ఆన్సర్ షీట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    RRR : ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. సాధించిన ఈ రికార్డులు తెలుసా

    ఐతే ఎగ్జామ్‌లో పుష్ప డైలాగ్స్ రాసిన విద్యార్థి వివరాలు తెలియలేదు. కానీ మనోజ్ సర్కార్ అనే ట్విటర్ యూజర్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.



    ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్స్ వస్తున్నాయి. పుష్ప ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మై హసేగా నహీ (నేను నవ్వేదే లేదు) అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. టీచర్ కూడా మార్కులు వేసేది లేదు అని ఇంకొందరు ట్వీట్స్ చేశారు. పుష్ప మేనియా ఇంకా తగ్గలేదు.. అల్లు అర్జున్ రేంజ్ అది.. అంటూ కొందరు తెలుగు యూజర్స్ కూడా కామెంట్స్ చేశారు. ఐతే ఎగ్జామ్స్‌లో అలా రాసే సీన్ లేదని.. పబ్లిసిటీ కోసమే ఇలా చేసి ఉంటారని, అది ఆన్సర్ షీట్ కాకపోయి ఉండొచ్చని కొందరు నెటిజెన్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆ ఫొటో మాత్రం నెట్టింట్లో రచ్చ చేస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Pushpa, Pushpa Movie, Tollywood, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు