ఏదీ ఆ అను... ఇంకొక్క ముద్ద... కుక్కకు గోరు ముద్దలు పెట్టిన చిన్నారి... వైరల్ వీడియో...

ఆ పాప... తన చేతులతో... అన్నం కూర కలిపి... కుక్కకు అలా పెడుతున్న వీడియో చూసి... అందరూ ప్యూర్ లవ్ అని మెచ్చుకుంటున్నారు.

news18-telugu
Updated: June 27, 2020, 1:16 PM IST
ఏదీ ఆ అను... ఇంకొక్క ముద్ద... కుక్కకు గోరు ముద్దలు పెట్టిన చిన్నారి... వైరల్ వీడియో...
ఏదీ ఆ అను... ఇంకొక్క ముద్ద... కుక్కకు గోరు ముద్దలు పెట్టిన చిన్నారి... (credit - instagram)
  • Share this:
పిల్లలు దేవుడితో సమానం అని ఎందుకంటారో మనకు తెలుసు. వాళ్లకు స్వార్థం అంటే తెలీదు. నవ్వొస్తే నవ్వుతారు... ఏడుపొస్తే ఏడుస్తారు. ప్రపంచ పోకడతో సంబంధం లేకుండా... వాస్తవంగా ఉంటారు. అలాంటి ఓ చిన్నారి... అనంతమైన ప్రేమను కురిపించింది. తన పెంపుడు కుక్కపై ప్రేమ, దయ, జాలి ఇలా అన్నీ ఒకేసారి చూపిస్తూ... చుట్టుపక్కల అందర్నీ ఆకర్షించడమే కాదు... ఏకంగా ఇంటర్నెట్‌లో లెక్కలేనంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. జనరల్‌గా ఎవరైనా కుక్కను పెంచుకునేవారు... దానికి ఓ ప్లేటులో ఆహారం పెట్టడం చూస్తుంటాం. ప్లేటులో ఆహారాన్ని ఆ కుక్క తింటుంది. కానీ... ఇక్కడ ఈ చిన్నారి... తన గిన్నెలో అన్నం, కూర తన చేతులతో స్వయంగా కలిపి... ఆ కుక్క నోట్లో గోరుముద్దలు పెట్టింది.

మన చిన్నప్పుడు తల్లి... ఇంకొక్క ముద్దు... ఏదీ ఆ అను అంటూ... గోరు ముద్దలు ఎలా తినిపిస్తుందో... ఆ చిన్నారి కూడా... కుక్కకు ఒక్కో ముద్దూ నోట్లో పెడుతుంటూ... వద్దు వద్దంటూనే ఆ కుక్క... అంతే ప్రేమ చూపిస్తూ... అన్నం ముద్దలు తినేసింది. ఈ లవ్లీ వీడియో... నచ్చకుండా ఎలా ఉంటుంది.




 



View this post on Instagram




 

PURE LOVE 🐾❤️🐶 The upcoming generations are the future, if we teach them kindness, compassion and empathy for animals we would certainly control any animal abuse ahead. The basic we can try to teach children's is to feed animals and try to make them communicate with them. Adding on children's can learn values of responsibility, love and caring. We have obsolete laws for animal cruelties, the current generation who think themselves as great and animals as inferior are certainly not humans anymore. If we want to coexist, nurture species and protect our animals, then we need to start from the roots. And the best would be preparing our young ones with the feeling of empathy towards animals. What you think? Will this be effective and one of the ways to ahead protect our animals? Share your views. Please #bekindtoanimals because #animallivesmatter #loveallanimals #animalliberation #feedastray #saveanimals #choosecompassion . . . . . . . - - - - - - - - #streetdog #petsarefamily #dontshopadopt #dogsworld #rescuepup #furfriends #animalwelfare #rescuepetsofinstagram #mustlovedogs #dogs_of_instagram #instagramdogs #thedodo #dogsarefamily #dogsarelove #someonenotsomething #SpreadKhushiya #straydog #straydogs #streetdogs #streetdogsofbombay #indiedog #SushantSinghRajput #animalsmatter


A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) on





స్ట్రీట్ డాక్స్ ఆఫ్ బాంబే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ స్వీట్ లవ్ వీడియో కనిపించింది. తన జర్మన్ షెపర్డ్ జాతి కుక్కకు ఆ చిన్నారి అన్నం కలిపి పెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది ఈ వీడియో చూసి... హ్యాపీ, లవ్ ఇమోజీలు పెడుతున్నారు. ఈ రోజుకు ఈ వీడియో చూశాను అది చాలు అంటూ స్వీట్ కామెంట్స్ ఇస్తున్నారు.
First published: June 27, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading