హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Cyclops: ఒంటి కన్ను.. రెండు నాలుకలు.. ముక్కు లేదు.. వింత కుక్క పిల్ల జననం

Cyclops: ఒంటి కన్ను.. రెండు నాలుకలు.. ముక్కు లేదు.. వింత కుక్క పిల్ల జననం

వింత ఆకారంలో ఉన్న కుక్క పిల్ల (Image :Twitter)

వింత ఆకారంలో ఉన్న కుక్క పిల్ల (Image :Twitter)

Cyclops: సాధారణంగా కుక్కలకు కూడా రెండు కళ్లు, ముక్కు, ఒక నాలుక.. ఉంటాయి. అయితే ఇక్కడ ఒక కుక్క పిల్ల మాత్రం ఒంటి కన్నుతో పుట్టింది. అంతేకాదు.. దానికి రెండు నాలుకలూ ఉండటం గమనార్హం.

 • News18
 • Last Updated :

  ఒక పెంపుడు కుక్క విచిత్రమైన జీవికి జన్మనిచ్చింది. విచిత్ర జీవి అంటే అదేదో గ్రహాంతరవాసి అనుకునేరు. కుక్క పిల్లే. కానీ అది విచిత్ర రూపంలో పుట్టింది. సాధారణంగా కుక్కలకు కూడా రెండు కళ్లు, ముక్కు, ఒక నాలుక.. ఉంటాయి. అయితే ఇక్కడ ఒక కుక్క పిల్ల మాత్రం ఒంటి కన్నుతో పుట్టింది. అంతేకాదు.. దానికి రెండు నాలుకలూ ఉండటం గమనార్హం.

  ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుందీ ఘటన. ఫిలిప్పీన్స్ లోని అక్లాన్ ప్రావిన్స్ కు చెందిన అమీ డి మార్టిన్ తన ఇంటిలో ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే అది ఈనెల 5న ప్రసవించింది. రెండు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. అందులో మొదలు పుట్టిన కుక్క పిల్ల మాములుగానే ఉన్నప్పటికీ.. రెండో కుక్క పిల్ల మాత్రం వింతగా పుట్టింది. దానికి ఒకటే కన్ను ఉండగా.. రెండు నాలుకలున్నాయి. ఆశ్చర్యకరంగా ఆ కుక్క పిల్లకు ముక్కు రాలేదు. దీంతో అది నోటి తోనే ఊపిరి పీల్చుకుంది. కన్ను కూడా అటూ ఇటూ కాక.. సరిగ్గా తల మధ్యలో ఉంది.


  ఇలా జన్మించిన కుక్క పిల్ల.. తల్లి పాలు తాగడానికి చాలా ఇబ్బంది పడింది. అయితే ఇది చూసి చలించిపోయిన సదరు యజమాని.. దానికి పాలు తాగించాడు. ముక్కు లేకుండా.. ఒకటే కన్నుతో పుట్టినా అది మనుగడ సాగిస్తుందని ఆశించాడు. కానీ అతడి ఆశలు అడియాసలయ్యాయి. సరిగ్గా ఊపిరి పీల్చకపోవడంతో అది ఫిబ్రవరి 6 న మరణించింది.

  అయితే తల్లి కుక్క గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా విష ఆహారం తిని ఉండటం వల్ల కుక్క పిల్ల ఇలా జన్మించి ఉంటుందని పశు వైద్య నిపుణులు తెలిపారు. కుక్క పిల్ల సైక్లోపియా అనే అరుదైన వ్యాధి తో చనిపోయిందని చెప్పారు. మెదడును అభివృద్ధిని ప్రభావితం చేసే జన్యులోపాలు లేదంటే విషాహారం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని వారు వివరించారు. కాగా.. సదరు యజమానికి చనిపోయిన కుక్క పిల్లను పాతి పెట్టడానికి ఇష్టపడలేదు. దానిని గాజు పెట్టెలో భద్రపరిచారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Dog, Philippine, Social Media, Twitter, Viral, VIRAL NEWS

  ఉత్తమ కథలు