• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PUNJAB WOMAN WINS RS ONE CRORE LOTTERY AFTER BUYING ONLY RS 100 LOTTERY TICKET FULL DETAILS HERE HSN GH

₹1 crore Lottery: కేవలం వంద రూపాయల ఖర్చు పెట్టి.. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలు అయిన మహిళ

₹1 crore Lottery: కేవలం వంద రూపాయల ఖర్చు పెట్టి.. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలు అయిన మహిళ

రూ. కోటి గెలుచుకున్న రేణు చౌహాన్

ఒక లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా రూ.కోటి గెలుచుకొని చూస్తుండగానే కోటీశ్వరి అయ్యారు ఒక మహిళ. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహా?

  • Share this:
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదని పెద్దలు చెబుతుంటారు. ఎంత కష్టపడే తత్వం ఉన్నా ఆవ గింజంత అదృష్టం ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే నానుడి కూడా ఉంది. తనకు దక్కిన అదృష్టంతో ఏకంగా రూ.కోటి గెలుచుకొని చూస్తుండగానే కోటీశ్వరి అయ్యారు ఒక మహిళ. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహాన్ గతంలో కొన్న ఒక లాటరీకి కోటి రూపాయలు వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ డబ్బు తీసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను, తాను కొన్న లాటరీ టికెన్‌ను రేణు గురువారం స్టేట్ లాటరీస్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించింది. ఇప్పుడు ఆ గృహిణి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రూ.100 విలువ చేసే ఒక లాటరీని రేణు కొనుగోలు చేసింది.

దీనికి లాటరీ డ్రాలో మొదటి బహుమతి వచ్చింది. ఈ డబ్బును దేవుడే తనకు పంపిచాడని ఆమె చెబుతోంది. తమ మధ్యతరగతి కుటుంబానికి లాటరీ డబ్బు ఊరటగా నిలుస్తుందని రేణు తెలిపారు. ఆమె భర్త అమృత్‌సర్ పట్టణంలో ఒక బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ భారీ ప్రైజ్ మనీ తమ కుటుంబం సజావుగా జీవించడానికి ఎంతగానో సహాయం చేస్తుందని ఆమె వివరించారు.


అద్దెకుంటున్న భార్యాభర్తలు.. తలుపులు తీసే ఉండటంతో మాట్లాడేందుకు వెళ్తే కనిపించిన దృశ్యం చూసి ఆ యజమానికి..

వరించిన విజయం
పంజాబ్ రాష్ట్రం అధికారికంగా లాటరీలను నిర్వహిస్తోంది. ఏటా ఎంతో మంది ప్రజలు వీటిని కొనుగోలు చేస్తారు. ‘పంజాబ్ స్టేట్ డియర్ 100 + లాటరీ’ లక్కీ డ్రాను ఫిబ్రవరి 11న ప్రకటించారు. దీంట్లో రేణుని విజయం వరించిందని పంజాబ్ స్టేట్ లాటరీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘టికెట్ నంబర్ D-12228కు కోటి రూపాయల గిఫ్ట్‌ ప్రైజ్ లభించింది. దాన్ని కొనుగోలు చేసిన రేణు డబ్బు తీసుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలను సమర్పించింది. త్వరలోనే ఆ డబ్బును ఆమె బ్యాంకు అకౌంట్‌లో వేస్తాం’ అని ఆ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: అర్ధరాత్రి.. రెండు గంటల సమయం.. గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులు.. ఆ 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఏం చేసిందంటే..
First published:

అగ్ర కథనాలు