కొందరు ప్రతి చిన్న విషయానికి కంట్రోల్ తప్పుతుంటారు. రోడ్డుమీద తరచుగా వాహనాలపై వెళ్తున్నప్పుడు, అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు.. ఒకరి వాహానం మరోకరికి తగలడం, వాహానాలు కంట్రోల్ తప్పి పక్క వాహానానికి గీసుకుని పోతుంటాయి. చాలా వరకు అనుకోకుండా జరుగుతాయి. కొందరు దురుసుగా ప్రవర్తిస్తు.. దీనికోసం నానా రచ్చ చేస్తుంటారు. గొడవలు పెట్టుకుంటారు. దాడులకు కూడా దిగుతుంటారు. కొన్ని సందర్భాలలో పార్కింగ్ విషయాలలో కూడా గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో జరిగాయి. తాజాగా, ఈ కోవకు చెందిన మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. పంజాబ్ లోని (Punjab) జలంధర్ లో షాకింగ్ ఘటన జరిగింది. రామమండి ప్రాంతంలో ఉన్న ఆస్పత్రిలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో.. చనిపోయిన తమ బంధువును చూడటానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను తన బైక్ ను పార్కింగ్ (Parking) చేయడానికి వెళ్లాడు. అప్పుడు అక్కడే ఉన్న అటెండర్, ఇతనితో వాగ్వాదానికి దిగాడు. పార్కింగ్ (Parking dispute) విషయంలో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.
ఇది కుర్చీలు.. హెల్మెట్ లతో కొట్టుకొవడం వరకు వెళ్లింది. దీంతో అక్కడ ఉన్న వారు కొంత మంది వీరిని సముదాయించారు. కానీ ఎవరు పట్టించు కోలేదు. వెంటనే .. పదుల సంఖ్యలో జనాలు గుమిగూడారు. ఇరు వర్గాలు కొట్టుకున్నారు. వెంటనే వారిని తర్వాత.. సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. దీనికి సంబంధించిన క్లిప్స్ నెట్టింట (Social media) వైరల్ గా (viral news) మారాయి. కాగా, చనిపోయిన వ్యక్తి అడంపూర్ వాసి గా సమాచారం. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి.
ఇదిలా ఉండగా మెట్రో స్టేషలో యువతి పట్ల యువకుడు.. నీచంగా ప్రవర్తించాడు.
ఢిల్లీ లో (Delhi) దారుణ ఘటన జరిగింది. జోర్ బాగ్ మెట్రో స్టేషన్ (metra rail station) పరిధిలో జూన్ 2న ఈ ఉదంతం చోటు చేసుకుంది. యువతి తాజాగా, తన వేధింపుల ఘటనను ట్విటర్ వేదికగా తెలిపింది. జూన్ 2 న యువతి రైలు కోసం వేచిచూస్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు యువతి దగ్గరకు వచ్చాడు.
మెల్లగా మాటలు కలిపాడు. ఆ తర్వాత.. ఆమె ముందు వికృతంగా ప్రవర్తించాడు. అతడి పనిని చూసి యువతి షాక్ కు గురైంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన తర్వాత... యువతి తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆ తర్వాత.. ఇప్పుడు తాను ఎదుర్కొన్న ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack with sticks, Crime news, Hospitals, Punjab