PUNJAB CONJOINED TWINS WHO CAN PROVE THAT ANYTHING CAN BE ACHIEVED IF TOGETHER SNR
Punjab:కలిసే పుట్టాం..చచ్చే వరకూ కలిసే ఉంటాం. ఏదైనా సాధించి చూపిస్తామంటున్న అవిభక్తకవలలు
Photo Credit:Instagram
Punjab: వాళ్లిద్దరు అన్నదమ్ములే కాదు ఆదర్శవంతమైన వ్యక్తులు. శరీరం అతుక్కొని పుట్టినప్పటికి భవిష్యత్తులో ఏదో సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. పంజాబ్‌లో ఎలక్ట్రిషన్స్గా చేస్తున్న 19ఏళ్ల సోహ్నా , మోహ్నా అనే అవిభక్తకవలలు ప్రజలకు స్పూర్తి కలిగించేలా జీవిస్తామంటున్నారు.
శరీరాలు అతుక్కొని పుట్టిన అవిభక్త కవలలు (Conjoined Twins)వాళ్లిద్దరు. ఒకటే దేహంతో రెండు ప్రాణాలతో జీవిస్తున్నారు. శరీర నిర్మాణంలో ఉన్న లోపాలను మర్చిపోయి ధైర్యం, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు. పంజాబ్ (Punjab)రాష్ట్రం అమృత్సర్(Amritsar)లోని పింగళ్వార సొసైటీ(Pingalwara Society)లో నివసిస్తున్నారు సోహ్నా(Sohna),మోహ్నా (Mohna). 19సంవత్సరాల వయసు కలిగిన ఈ కవలలు పుట్టుకతోనే రెండు కాళ్లు (pair of legs)నాలుగు చేతులు(four hands), రెండు మొండలను కలిగి ఉన్నారు. శరీర నిర్మాణంలోని లోపాన్ని చూస్తూ అందరూ జాలిపడటం ఇద్దర్ని వేరు చేస్తే బాగుంటుందన్న సలహాలను ఏమాత్రం పట్టించుకోలేదు సోహ్నా, మోహ్నా. ఎదుటి వాళ్ల మాటలకు మానసికంగా కుంగిపోకుండా జీవితంలో ఏదైనా సాధించి గొప్ప పేరు తెచ్చుకోవాలని సంకల్పించారు. ఒకే శరీరం ఇద్దరు వ్యక్తులుగా పెరుగుతున్న ఈ అవిభక్త సోదరులు సమాజంలో తామే కొందరికి స్పూర్తిగా నిలవాలని భావించారు. అందులో భాగంగానే ఎలక్ట్రీషియన్ (Electricians)ఉద్యోగాలు సంపాధించారు.
కలిసే ఏదో ఒకటి సాధిస్తాం..
విడదీస్తే ఇద్దరిలో ఒకరి ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు చిన్నప్పుడే చెప్పారు. దాంతో సోహ్నా, మోహ్నాను విడదీయాలన్న ఆలోచన తల్లిదండ్రులు చేయలేదు. పెద్ద పెరిగే కొద్ది వాళ్లు అందుకు అంగీకరించలేదు. ఒకరు బతికి మరొకరు చనిపోయేకంటే ఇద్దరం ఒకటిగా ఉండి మంచి పేరు సాధించాలని పట్టుదలపట్టారు. వారికి ఇష్టమైన ఎలక్ట్రికల్ ఫీల్డ్‌ని ఎంచుకొని అందులో తమ టాలెంట్‌ని నిరూపించుకుంటున్నారు. సమాజంలో విడిపోయి ఏదీ సాధించలేమని కలిసి సంతోషంగా ఉన్నామనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలన్నదే తమ ప్రయత్నం అంటున్నాడు సోహ్నా. చిన్నప్పటి నుంచి ఇద్దరి శరీరాలు అతుక్కొని పుట్టినప్పటికి డ్రెస్‌లు, వారి ఆహార అలవాట్ల విషయంలో ఎవరి అభిరుచికి తగ్గట్లుగా వాళ్లు నడుచుకుంటున్నారు. ఫ్రెండ్స్, సినిమాలు, టీవీ షోలు కూడా కలిసే చూస్తారు పంజాబ్‌కి చెందిన అవిభక్తకవలలు.
అవిభక్త కవలల ఆత్మస్థైర్యం..
దేశంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. వారికి వచ్చే చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా భావిస్తూ సమయం వృధా చేసుకోవడం కంటే..మనుకున్న సమయంలో కలిసి కోరుకున్నట్లుగా జీవించడం గొప్పగా ఉంటుందంటున్నాడు మరో అవిభక్త కవల సోదరుడు మోహ్నా. చిన్నప్పటి నుంచి ఒకే శరీరంతో పుట్టిన తాము ఆడుకునేందుకు, నిలబడేందుకు, కూర్చోవడానికి తగినట్లుగా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకున్నామని తెలిపారు. అందరి పిల్లలతో కలిసే ఆడుకునే వాళ్లమంటున్నారు. ప్రస్తుతం తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్న సోహ్నా, మోహ్నా..రాబోయే రోజుల్లో పంజాబ్‌లో అవిభక్తకవలలు ఏదో సాధించారనే గొప్ప పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేయడానికి కృషి చేస్తామన్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.