హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

గర్భావేడులలో ఫుల్ జోష్ తో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వీడియో వైరల్..

గర్భావేడులలో ఫుల్ జోష్ తో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వీడియో వైరల్..

డ్యాన్స్ చేస్తున్న సీఎం భగవంత్ మాన్

డ్యాన్స్ చేస్తున్న సీఎం భగవంత్ మాన్

Punjab: సీఎం భగవంత్ మాన్ స్థానికంగా జరిగిన నవరాత్రి నవరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన డ్యాన్స్ చూసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) కొన్నిరోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ క్రమంలో ఆయనను అపోసిషన్ నాయకులు సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన నవరాత్రి వేడుకలలో మాత్రం ఉత్సాహంగా పాల్గొన్నారు. గుజరాత్, రాజస్థాన్ పలుచోట్ల నవరాత్రి వేడుకలలో అమ్మవారి ముందు గర్భా డ్యాన్స్, కోలాటం ఆడుతుంటారు. దీనిలో అనేక మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ డ్యాన్స్ వేడుకను ఎంతో ఉల్లాసంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో రాజ్ కోట్ లో ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో సీఎం పాల్గొన్నారు. దీనిలో భాగంగా సీఎం చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లో  (Gujarat) పంజాబ్ ముఖ్యమంత్రి రాజ్ కోట్ లో నవరాత్రి వేడుకలలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొందరు యువతీ యువకులు ఉత్సాహంగా గర్భా డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు సీఎం వారితో కలిసి గర్భా డ్యాన్స్ చేశారు. అక్కడున్న వారిని మరింత ఉత్సాహపరిచారు.

ప్రస్తుతం సీఎం భగవంత్ మాన్  (Bhagwant Mann) చేసిన డ్యాన్ సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది. కాగా, నవరాత్రి వేడుకలు దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరన గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ , ఆప్ పార్టీలు తమ ప్రచారం స్పీడ్ ను పెంచాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే సీఎం భగవంత్ మాన్ అనేక వివాదాల్లో చిక్కుకుని విమర్శల బారిన పడ్డారు. జర్మనీలో తాగి విమానం ఎక్కడం వలన, ఎయిర్ లైన్స్ అధికారులు విమానంనుంచి దింపేశారని అపోసిషన్ లీడర్ లు విమర్శించారు. అంతే కాకుండా.. తాజాగా, సీఎం కాన్వాయ్ లోని వాహానాల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bhagwant Mann, Gujarat, Viral Video

ఉత్తమ కథలు