హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.. రెండు రాష్ట్రాల చారిత్రక ఒప్పందం.. ఇక నుంచి..

చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.. రెండు రాష్ట్రాల చారిత్రక ఒప్పందం.. ఇక నుంచి..

సమావేశమైన సీఎం, డిప్యూటీ సీఎంలు

సమావేశమైన సీఎం, డిప్యూటీ సీఎంలు

Punjab: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా ఒకే నిర్ణయానికి వచ్చాయి. ఇక మీదట తమ రాజధానిలో ఉన్న విమానశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టడానికి ముందుకు వచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యనేతలు హజరయ్యారు. దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా మధ్య శనివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇక మీదట .. చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు మార్చేందుకు అంగీకరించాయి. కాగా, రెండు ప్రభుత్వాల మధ్య సమావేశం తర్వాత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్‌లో ఇలా అన్నారు, “షహీద్ భగత్ సింగ్ జీ తర్వాత చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుపై పంజాబ్, హర్యానా అంగీకరించాయి.

ఈ అంశంపై ఇవాళ హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశం జరిగిందని తెలిపారు. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు మార్చాలని సూచించడం ఇదే మొదటిసారి కాదు. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలని 2016లో హర్యానా అసెంబ్లీ తీర్మానం చేసిందనే విషయాన్ని భగవంత్ మాన్ గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా  బిల్కిస్ బానో(Bilkis Bano)అత్యాచారం కేసు తీవ్ర రచ్చకు దారితీసింది.

ఈ ఘటనలో మొత్తం 11 మంది నిందితులను గుజరాత్‌ బీజేపీ(Gujarat BJP)ప్రభుత్వం క్షమాభిక్ష పరుతో వదిలిపెట్టడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు దోషుల్ని విడిచిపెట్టడమే కాకుండా వారికి సన్మానం చేయడంపై ప్రజాసంఘాలు, మైనార్టీ నేతలు మండిపడుతున్నారు. జైలు నుంచి విడుదలైన 11మంది నిందితులు బ్రాహ్మణులేనని వారంతా సంస్కారవంతులని గోద్రా సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే రౌల్జీ వ్యాఖ్యానించడాన్ని మజ్లీస్‌(AIMIM)పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌(Hyderabad)ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ(Asaduddin Owaisi)తీవ్రంగా తప్పుపట్టారు.

మన దేశంలో కొన్ని కులాల వాళ్లు నేరం చేసినట్లు నిర్ధారణ జరిగినప్పటికి వాళ్లు జైలు నుంచి యధేచ్చగా విడుదల కావచ్చు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కొందరికి కులం, మతం ఏదైనా సరిపోతుందని అన్నారు. అంతే కాదు కనీసం గాడ్సేను(Godsey)దోషిగా నిర్ధారించి ఉరి తీసినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలని తెలిపారు.

రౌల్జీ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్ ..

గుజరాత్‌ బీజేపీ ప్రభుత్వం కులాల పేరుతో దోషుల్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇవన్నీ చేస్తోందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ మహిళా సాధికారత గురించి మాట్లాడిన రోజే... రెమిషన్ విధానం కింద ఆగస్టు 15న 2002 నాటి బిల్కీస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిల్కీస్‌ బానో అత్యాచార కేసులో కేవలం ముస్లిం అనే మతాన్ని చూడవద్దని ...ఇలాంటి ఘటనే వేరే మహిళలకు జరిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ. అంతేకాదు ప్రముఖ చానళ్లలో పని చేస్తున్న మహిళ యాంకర్‌లు ఈవిషయాన్ని లేవనెత్తాలని ..బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

First published:

Tags: Bhagwant Mann, Politics, Punjab

ఉత్తమ కథలు