• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PUNE SALON OWNER OFFERS SHAVING WITH GOLDEN RAZOR THIS IDEA CHANGES HIS LIFE SK

Gold Razor: బంగారం రేజర్‌తో షేవింగ్.. జస్ట్ రూ.100 మాత్రమే.. ఎక్కడంటే..

Gold Razor: బంగారం రేజర్‌తో షేవింగ్.. జస్ట్ రూ.100 మాత్రమే.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

గోల్డెన్ రేజర్‌తో షేవింగ్‌కు అతడు రూ.100 వసూలు చేస్తున్నాడు. అందుబాటు ధరలోనే ఉండడంతో అతడి షాప్‌కు గిరాకీ పెరిగింది. డబ్బులు కూడా బాగా వస్తున్నాయి.

  • Share this:
    కరోనా మహమ్మారి అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసింది. వ్యాపారాలను నష్టాల్లో ముంచేసింది. లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారులు కోలుకుంటున్నారు. ఐనప్పటికీ మునపటితో పోల్చితే అంతగా కస్టమర్లు రావడం లేదు. హోటళ్లు, బట్టల షాపులతో పాటు సెలూన్‌లది కూడా ఇదే పరిస్థితి. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పుణెకు చెందిన ఓ సెలూన్ షాప్‌లో ఏకంగా బంగారం రేజర్‌తో షేవింగ్ చేస్తున్నారు. వామ్మో బంగార రేజర్‌తోనా? అని ఆశ్చర్యపోకుండి. ఇది నిజం. బంగారంతో తయారు చేసిన రేజర్‌తోనే షేవింగ్స్ చేస్తున్నారు.

    అవినాష్ బొరుండియా అనే బార్బర్‌కు పుణె ఓ సెలూన్ షాప్ ఉంది. లాక్‌డౌన్‌కు ముందు బాగా వ్యాపారం జరిగేది. కస్టమర్లు బాగా రావడంతో అతడి ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉండేది. కానీ కరోనా రాకతో అంతా తలకిందులయింది. జనాలు ఎవరూ రాలేదు. ఇక లాక్‌డౌన్ ప్రకటించడంతో.. ఏకంగా షాపే మూతపడింది. అన్‌లాక్ దశలో షాపులు మళ్లీ తెరచుకున్నా.. కరనా భయంతో జనాలు ఎవరూ రాలేదు. కస్టమర్లు లేక సెలూన్ షాప్ వెలవెలబోయింది. ఎలాగైనా కస్టమర్లను ఆకర్షించాలన్న ఉద్దేశంతో బంగారం రేజర్‌ను తయారు చేయించాడు. 80 గ్రాముతో తయారుచేసిన ఆ రేజర్‌కు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టాడు. షాప్ ముందు బంగారం రేజర్‌తో షేవింగ్ అని బోర్డుపెట్టేశాడు. ఇటీవలే ఓ ఎమ్మెల్యే చేతుల మీదుగా షాప్‌ను ప్రారంభించాడు.

    బోర్డు చూసి జనాలు ఆశ్చర్యపోయారు. గోల్డ్ రేజర్ మనం కూడా షేవింగ్ చేయించుకుంటే బాగుటుందని కదా? అని ఆలోచించారు. భిన్నంగా ఉండడం.. పైగా గోల్డెన రేజర్‌తో చేసింది కావడంతో.. కస్టమర్లు క్యూకడుతున్నారు. ఇప్పుడు అవినాష్ సెలూన్ షాప్ కళకళలాడుతోంది. గోల్డెన్ రేజర్‌తో షేవింగ్‌కు అతడు రూ.100 వసూలు చేస్తున్నాడు. అందుబాటు ధరలోనే ఉండడంతో అతడి షాప్‌కు గిరాకీ పెరిగింది. డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. మొత్తానికి ఒక్క ఐడియా అతడి షాప్‌తో పాటు జీవితాన్నే మార్చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు