క్యాషియర్ తో సరసాలాడొద్దంటూ.. రెస్టారెంట్ లో వెరైటీ మెనూకార్డు.. నెట్టింట ఫన్నీ రియాక్షన్స్

రెస్టారెంట్ మెనూ కార్డు

పుణేకు చెందిన ఈ హోటెల్ కస్టమర్లకు మంచి డైనింగ్ అనుభూతి కలిగించడమే కాకుండా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈ హోటెల్ మెనూ కార్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  • Share this:
కరోనా మహమ్మారి ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కొన్ని అలవాట్లను మాత్రం మార్చింది. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అందుకే బయటకు వెళ్లినా మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం లాంటివి జీవనవిధానంలో భాగంగా మారాయి. బయట ఆహారం తినాలనుకున్నప్పుడు కూడా ప్రజలు ఇలాంటి శుభ్రతనే ఆశిస్తున్నారు. అయితే మరీ హైజీన్ గా ఉండే రెస్టారెంట్లు దొరకడం కష్టం. కానీ ఓ రెస్టారెంటు మాత్రం శుభ్రతకు సంబంధించిన అన్ని నియమాలు పాటించడమే కాకుండా వచ్చిన కస్టమర్లు ఏమేమి చేయాలి? చేయకుడదో పూర్తి జాబితాను సిద్ధం చేసి మెనూలో ఉంచింది. పుణేకు చెందిన ఈ హోటెల్ కస్టమర్లకు మంచి డైనింగ్ అనుభూతి కలిగించడమే కాకుండా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈ హోటెల్ మెనూ కార్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ రెస్టారెంట్ పరిసరాల్లో ఏమిమి చేయాలి, చేయకూడదో రెండు డజన్లకుపైగా జాబితాను రూపొందించారు. వీటిలో నో స్మోకింగ్, నో అవుట్ సైడ్ ఫుడ్, బేరం ఆడకూడదు, బ్రష్ చేయకూడదు, అనవసర విషయాలు మాట్లాడకూడదు లాంటి ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించారు. అంతేకాకుండా 'నిద్రపోవడం', 'పళ్లు తోముకోవడం' లాంటివి నిషేధించారు. ల్యాప్ టాప్ ను కూడా తీసుకురాకూడదు. మెనూ ప్రకారం అనుమతించని విషయాల జాబితాలో 'ఉచిత సలహాలు ఇవ్వకూడదు', 'క్యాషియర్ తో సరసాలాడకూడదు' లాంటి సరదా అంశాలను కూడా ప్రస్తావించడం గమనార్హం.పుణె కేఫ్ కు చెందిన ఈ ఫన్నీ జాబితా ట్విట్టర్లో ట్రెండ్ అయింది. దాదాపు 1600 పైగా లైక్స్ ను అందుకుంది. అంతేకాకుండా అనేక వందలమంది వినియోగదారులు తమ ప్రతిస్పందనలను కామెంట్ రూపంలో తెలియజేశారు.


ఇది కూడా చదవండి: గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్.. దెయ్యం భయంతో ఇళ్లన్నీ ఖాళీ.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే..

"ఈ కేఫ్ లో తినడానికైనా పుణెకు వెళ్లాలి" అని ఒకరు స్పందించగా.. "జాబితా చదివి ఊపిరి కూడా తీసుకోలేదు" అని మరొకరు కామెంట్ చేశారు. "కేఫేలో ఎవరైనా బ్రష్ చేసుకుంటారా" అని ఇంకొకరు స్పందించారు. కోవిడ్ అనంతరం రెస్టారెంట్ల ద్వారా ఇలాంటి జాబితాను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి రెస్టారెంట్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయాలను కామెంట్ రూపంలో తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఇలాంటి రెస్టారెంట్లలో తప్పుకుండా భోజనం చేయాలని అనుకుంటున్నారు. కరోనా మిగిల్చిన సంక్షోభం వల్ల ప్రజల్లో శుభ్రత బాగా పెరిగిందని, అయితే ఇప్పటికీ పూర్తిగా మారలేదని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
2.3 కిలోల బంగారం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. చొక్కా జేబే పట్టించింది.. ఒకే ఒక్క మిస్టేక్ చేసి అడ్డంగా బుక్కయిన 108 సిబ్బంది
Published by:Hasaan Kandula
First published: