Discount: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే స్విగ్గీ, జొమాటోలో డిస్కౌంట్

ట్రాఫిక్ రూల్స్ పాటించినవారికి స్విగ్గీ, జొమాటో కూపన్స్ ఇస్తున్నారు. అంటే రూల్స్ అతిక్రమించినవారికి జరిమానాలు... రూల్స్ పాటించేవారికి డిస్కౌంట్ కూపన్స్ అన్నమాట.

news18-telugu
Updated: July 20, 2019, 4:18 PM IST
Discount: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే స్విగ్గీ, జొమాటోలో డిస్కౌంట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ట్రాఫిక్ రూల్స్‌పై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. రేడియోలు, టీవీలు, హోర్డింగ్‌లపై ప్రకటనలు ఇస్తుంటారు. వాహనదారులు ట్రాఫిక్ నియమనిబంధనలు సరిగ్గా పాటిస్తే ప్రమాదాలను, ట్రాఫిక్ సమస్యల్ని చాలావరకు తగ్గించొచ్చు అన్నది పోలీసుల ఆలోచన. పోలీసులు ఇంత చేసినా అన్నీ తెలిసి కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవాళ్లున్నారు. అందుకే వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించేలా ప్రోత్సహించేందుకు పూణె పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించినవారికి స్విగ్గీ, జొమాటో కూపన్స్ ఇస్తున్నారు. అంటే రూల్స్ అతిక్రమించినవారికి జరిమానాలు... రూల్స్ పాటించేవారికి డిస్కౌంట్ కూపన్స్ అన్నమాట. అంటే తప్పు చేసినవారిని శిక్షించడంతో పాటు, తప్పు చేయకుండా బుద్ధిగా వాహనాలు నడిపినవారికి రివార్డ్ ఇస్తున్నారు పూణె పోలీసులు.

'ఆభార్ యోజన' పేరుతో పూణె పోలీసులు ప్రారంభించిన కార్యక్రమం ఇది. రోడ్డుపైన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వాహనాలు నడుపుతున్నవారిని గుర్తించి మరీ డిస్కౌంట్ కూపన్స్‌ని ఎస్ఎంఎస్ పంపుతున్నారు. వాహనదారులకు డిస్కౌంట్స్ ఇచ్చేందుకు స్విగ్గీ, జొమాటోతో పాటు ఇతర రెస్టారెంట్లతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు పూణె పోలీసులు. ఆ రెస్టారెంట్లు స్వచ్ఛందంగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం. బండి డాక్యుమెంట్స్ కూడా అన్నీ పక్కాగా మెయింటైన్ చేసేవారికీ ఈ డిస్కౌంట్ కూపన్స్ అందిస్తున్నారు పోలీసులు. పూణె పోలీసుల వినూత్న కార్యక్రమం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే 10,000 పైగా కూపన్లు, డిస్కౌంట్ ఓచర్లను వాహనదారులకు అందించారు పూణె పోలీసులు. కూపన్లు పొందినవాహనదారులందరూ వాటిని రీడీమ్ చేసుకోవడం చూస్తే పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయినట్టే.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి మధ్యప్రదేశ్ టూర్... ప్యాకేజీ వివరాలివే

Amazon: కెమెరా లెన్స్ ధర రూ.9 లక్షలు... పొరపాటున రూ.6,500 ధరకు అమ్మేసిన అమెజాన్‌FASTag: ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే భారీగా టోల్ ఛార్జీలు... డిసెంబర్ 1 డెడ్‌లైన్
Published by: Santhosh Kumar S
First published: July 20, 2019, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading