Home /News /trending /

PUNE GRAND HOMECOMING A FAMILY BROUGHT THEIR NEWBORN GIRL CHILD IN A CHOPPER VIDEO GOES VIRAL PAH

Affection on Daughter: తన కుమార్తె కు కన్న తండ్రి స్పెషల్ వెల్ కమ్.. ఏం చేశాడో తెలుసా..?

చిన్నారిని ఎత్తుకున్న తల్లిదండ్రులు

చిన్నారిని ఎత్తుకున్న తల్లిదండ్రులు

Maharashtra: ఆడపిల్లలను చాలా మంది లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే .. ఆ సందడే వేరుగా ఉంటుంది. అయితే, తన తమ వంశంలో పుట్టిన తొలి పసికందుకు ఆ కుటుంబం గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది.

Puna family brought their newborn girl child in a chopper: ప్రస్తుతం దేశంలో ఆడపిల్లలకు డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు.. తమకు మగపిల్లవాడే పుట్టాలని భావించేవారు. రాను రాను ప్రజల ఆలోచనల విధానంలో మార్పులు వస్తున్నాయి. ఆడపిల్లలను అపురూపంగా చూసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఆడబిడ్డలను ప్రొత్సహించే క్రమంలో పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పెళ్లై అత్తారింటికి అడుగు పెట్టే వరకు పలు పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికి కూడా ఆడపిల్లలు వివక్షతనుఎదుర్కొంటున్నారు. అట్లాంటి వారిలో మార్పులు వచ్చేలా చర్యలు తీసుకొవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

అయితే, తమ ఇంట్లొ ఆడపిల్ల పుడితే లక్ష్మీ స్వరూపం తమ ఇంట్లో పుట్టిందని చాలా మంది సంతోషిస్తారు. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కొంత మంది తమ తల్లి పాప రూపంలో పుట్టిందని భావిస్తే.. మరికొందరు.. తమ పాపలో తమ వంశంలోని పెద్దలను చూసుకొని మురిసిపోతుంటారు. అయితే, తమ వంశంలో తొలిసారి ఒక ఆడపిల్ల పుట్టిందని ఒక కుటుంబం పసికందుకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తారు. ప్రస్తుతం ఈ  కోవకు చెందిన ఒక  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని పూణెలో తమ కుతూరికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షేల్గావ్ కు చెందిన విశాల్ జరేకర్ కు కూతురు పుట్టింది. దీంతో తెగ సంబర పడిపోయాడు. వారి కుటుంబంలో తొలిసారి కూతురు పుట్టింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తన కూతురిని ఇంటికి గ్రాండ్ గా వెల్ చెప్పాలని విశాల్ ఆలోచించాడు. వెంటనే తన కూతురి కోసం ప్రత్యేక ఛాపర్ రైడ్ ను ఏర్పాటు చేశాడు. తన ఇంటి సమీపం వరకు ఛాపర్ రైడ్ లో వచ్చారు. ఆ తర్వాత.. బంధువులు, స్నేహితుల మధ్యలో తన కూతురికి స్పెషల్ గా వెల్ కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Maharashtra, Pune, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు